అందరిముందు పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు మొక్కిన హీరో.. వైరల్ అవుతున్న వీడియో

కొందరు హీరోలు మానవత్వం చాటుకోవడంలో ముందుంటారు. ఎంతో మంది హీరోలు సమాజ సేవలో ముందుంటారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఛారిటీల ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు. మహేష్ బాబు చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ప్రజలకు సాయం చేస్తున్నారు.

అందరిముందు పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు మొక్కిన హీరో.. వైరల్ అవుతున్న వీడియో
Hero

Updated on: Feb 05, 2026 | 4:39 PM

సినీ సెలబ్రెటీలు చాలా మంది తమ నటనతోనే కాదు మానవత్వంతో, సమాజ సేవతో అభిమానులను సంపాదించుకుంటూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వెయ్యికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపారు. అలాగే హీరో సూర్య అగరం ఫౌండేషన్‌ స్థాపించి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. అలాగే మరికొంతమంది హీరోలు కూడా ప్రజలకు సేవ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఓ హీరో చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. పారిశుద్ధ్య కార్మికురాలికి చెప్పులు తొడిగి మానవత్వం చాటుకున్నాడు ఆ హీరో..ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? పారిశుద్ధ్య కార్మికురాలికి చెప్పులు ఎందుకు తొడిగాడో ఇప్పుడు చూద్దాం.!

ఇటీవలే చెన్నైలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు రోడ్డు శుభ్రం చేస్తుండగా ఆమెకు ఓ బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ లో 45 లక్షల నగదు, 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే ఆమె ఆ బ్యాగ్ ను ఎంతో నిజాయితీగా పోలీసులకు అప్పగించింది. ఆమె నిజాయితీ గుర్తించి సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి పిలిచి సన్మానించి బంగారు గొలుసు బహుకరించారు. ఆమె పేరు పద్మ. సూపర్ స్టార్ సన్మానించిన తర్వాత పద్మ పేరు మారుమ్రోగిపోయింది.

తాజాగా ఆమెను ఓ కాలేజీ ఈవెంట్ కు ఆహ్వానించారు. ఇదే ఈవెంట్ కు తమిళ్ నటుడు , దర్శకుడు పార్తీబన్‌ కూడా హాజరయ్యారు. కాగా స్టేజ్ పై పద్మను పార్తీబన్ ఘనంగా సన్మానించారు. అలాగే స్వయంగా ఆమెకు చెప్పులు తొడిగి ఓ చీరను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో పై పార్తీబన్ మాట్లాడుతూ.. బంగారం విలువ పెరిగే కొద్దీ మానవత్వం తగ్గిపోతుంది. ఏడాది 360 రోజులు పనిచేసే ఆమె 360 గ్రాముల బంగారం దొరికితే దాన్ని యజమానికి తిరిగిచ్చేసింది. అందుకే ఆమెకు పాదపూజ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని పార్తీబన్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..