ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. లైగర్ సినిమా తర్వాత కొద్దిరోజులుగా బ్రేక్ తీసుకున్న పూరి జగన్నాథ్ తన మనసులోని మాటలను పూరి మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో విభిన్న కాన్సెప్ట్స్ గురించి వివరించిన ఆయన.. శనివారం తడ్కా గురించి చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవకు… మనస్పర్థలకు మూడో వ్యక్తి కారణమంటూ తడ్కా గురించి తెలిపారు. జీవితంలో జరిగే సగం గొడవలు ఈ తడ్కా వల్లే అంటూ వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు పూరి మ్యూజింగ్స్ ద్వారా మిర్రరింగ్ గురించి చెప్పుకొచ్చారు. మనమిద్దం ఒకటే అని ఫీలింగ్ మనల్ని మోసం చేస్తారంటూ .. మనలాగే కనిపిస్తారంటూ చెప్పుకొచ్చారు. మరీ ఈ మిర్రరింగ్ అంటే ఎంటో తెలుసుకుందామా.
“ఆరు సావాసం చేస్తే వారు వీరు.. వీరు వారు అవుతారని అంటారు.. దానిని ఇంగ్లీష్ లో మిర్రరింగ్ అంటారు. మనకు నచ్చిన మనిషిని పదే పదే పరిశీలించడం వలన మనకు తెలియకుండానే వాళ్ల లక్షణాలు వచ్చేస్తాయి. అక్కడి నుంచి మనం కూడా వాళ్లలాగానే ప్రవర్తిస్తాం. దీన్నే మిమికింగ్ అంటారు. వాళ్ల హావభావాలు.. మాటకు మాటకూ వాళ్లు ఇచ్చే గ్యాప్.. స్పీచ్ స్టైల్ అన్ని కాపీ కొడతాం. బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు.. వాళ్ల మైండ్ కూడా కాపీ కొడతాం. వాళ్లలాగానే ఆలోచిస్తాం. ఫుడ్ కూడా వాళ్లలాగే తింటాం. దీని వల్ల ఇద్దరి మధ్య స్నేహం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మిర్రరింగ్ ఎక్కువగా సీనియర్స్, జూనియర్స్ మధ్య, కపుల్స మధ్య, ప్రభావంతులైన వారికీ, మనకీ మధ్య జరుగుతుంది. మిర్రరింగ్ ఇంపాక్ట్ వళ్ల మన డ్రెస్సింగ్ మారవచ్చు. ఆలోచనా విధానం మారవచ్చు.
ఈ మిర్రరింగ్ లో ఫ్రెండ్స్ ఉంటారు..శత్రువులు ఉంటారు. కొందరు వ్యక్తులు.. మన పక్కనే ఉండి.. మనల్ని కాపీ కొడుతూ.. నువ్వు నేను ఒకటే అన్నా అని ఫీలింగ్ కలిగించి మనల్ని మోసం చేస్తారు. ఈ మిర్రరింగ్ వలన మీ పార్టనర్ లో బాడీ పెయిన్స్ మీకు షిప్ట్ అవుతాయి. దీనివల్ల పాజిటివ్ లక్షణాలు వస్తే పర్లేదు. నెగిటివ్ క్వాలిటీస్ రాకుండా చూసుకోండి. ” అంటూ చెప్పుకొచ్చారు పూరీ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.