
ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా కప్పు కొట్టింది. ఎప్పటికప్పుడు ఈసారి కప్ మాదే.. ఈసారి కప్ మాదే అంటూ 17 ఏళ్లు ఊరించింది. చివరికి ఐపీఎల్ 18వ సీజన్‌లో టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ 18 ఏళ్ల కలను జట్టు నిజం చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్లుగా ఫ్యాన్స్ ఈ రోజుకోసం నిరీక్షించారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ఈసారి కప్ కొట్టామంటూ ఆర్‌సీబీ అభిమానులు దిక్కులు పిక్కటిల్లేలా సంబరాలు చేసుకున్నారు.
ఇలా అభిమానుల నుంచి మొదలు సినీ సెలబ్రిటీల వరకు అందరూ సంబరాలు చేసుకున్నారు. తమ భావోద్వేగాలను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా వీడియోలను షేర్ చేస్తున్నారు. భారీ తెరపై మ్యాచ్‌ను వీక్షించిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్… ఆర్సీబీ విజయం సాధించిన వెంటనే ఆనందంతో ఎగిరి గంతేశారు. ఆయన సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను ఆయన సతీమణి లికితారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. “ఈ సాలా కప్ నమ్‌దు. 18 ఏళ్ల కల నెరవేరింది. క్రేజియెస్ట్ క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్‌కు ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్” అంటూ ఆమె రాసుకొచ్చారు. అంతేకాదు, జూన్ 4 ప్రశాంత్ నీల్ బర్త్‌డే కూడా కావడంతో ఆ ఆనందం రెట్టింపు అయింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ కప్పు కొట్టడంతో సర్వాత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఎన్టీఆర్, నీల్ వర్కింగ్ టైటిల్ తెరకెక్కిస్తుండగా.. డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. భారీ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని.. ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటించనున్నట్లు సమాచారం.
Director #PrashanthNeel at #NTRNeel sets in RFC ❤️❤️
As King Kohli finally lifts his first IPL trophy,
the other King 👑 @tarak9999, is getting ready to create magic on screen 💥
What a great moment to witness!#RCB #IPLFinals #KingKohli #NTRNeelpic.twitter.com/0mrNRjUAPx— Milagro Movies (@MilagroMovies) June 3, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..