NTR-Neel: ఎన్టీఆర్ సినిమా పై రూమర్స్.. ఎట్టకేలకు స్పందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఏమన్నారంటే..
జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్.. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ మూవీ గురించి వినిపిస్తున్న రూమర్స్ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్పందించారు.

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాక్. దేవర వంటి బ్లా్క్ బస్టర్ హిట్ తర్వాత తారక్ నటిస్తున్న యాక్షన్ డ్రామా కావడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో తారక్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. ముందు నుంచి ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్, ఎన్టీఆర్ మేకోవర్ గురించి అనేక రూమర్స్ నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై చిత్రయూనిట్ స్పందించింది.
ఎక్కువ మంది చదివినవి : Babu Mohan: స్టార్ హీరోలను సైతం లెక్క చెయ్యదు.. ఎవరినీ పట్టించుకోదు.. ఆమెలా ఎవరూ బతకలేరు.. బాబూ మోహన్ కామెంట్స్..
“లుక్ గురించి గానీ, షెడ్యూల్ రద్దు గురించి గానీ ప్రచారంలో ఉన్న వదంతులలో ఏమాత్రం నిజం లేదు. కేవలం సాధారణ సన్నాహాల విరామం మినహా, సినిమా ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతోంది. ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, వ్యాప్తి చేయవద్దని మేము అందరినీ కోరుతున్నాము. అధికారిక అప్‌డేట్‌లు ఎల్లప్పుడూ మా నుండే వస్తాయి.” అంటూ ప్రశాంత్ నీల్ టీమ్ ట్వీట్ చేసింది. దీంతో తారక్ సినిమా పై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ వచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..
కొన్ని రోజులుగా డ్రాగన్ సినిమాపై అనేక రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యిందంటూ ప్రచారం నడిచింది. అలాగే తారక్ లుక్స్ గురించి సైతం అనేక రూమర్స్ హల్చల్ చేశాయి. దీంతో అభిమానులలో నెలకొన్న గందరగోళాన్ని క్లియర్ చేయడానికి చిత్రయూనిట్ రంగంలోకి దిగింది.
ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Kota Srinivas Rao: చాలా మంది నటులు ఉన్నారు.. కానీ ఆ హీరోకు ఉన్న సత్తా ఎవరికీ లేదు.. కోట శ్రీనివాస రావు..
