వెర్సటైల్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ET (ఎవరికీ తలవంచడు)’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా మార్చి 10న(నేడు) ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుదల అవుతుంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. సినిమా ట్రైలర్ సినిమా ఉన్న అంచనాలను మరింత పెంచాయి. సినిమా విడుదల సందర్భంగా డైరెక్టర్ పాండిరాజ్ మాట్లాడుతూ.. ముందు మేం ET సినిమాను తెలుగు, తమిళ భాషల్లోనే రూపొందించాలని అనుకున్నాం. కానీ చివరకు నేను ఈ సినిమాలో చెప్పాలనుకున్న విషయం దేశంలో చాలా చోట్ల మహిళలు ఎదుర్కొంటున్నవే. కాబట్టి.. సినిమాను మలయాళ, కన్నడ, హిందీల్లోనూ విడుదల చేయాలనుకున్నాం. అలా ET పాన్ ఇండియా సినిమా అయ్యింది అన్నారు. అలాగే ఇప్పటి వరకు నేను డైరెక్ట్ చేసిన సినిమాలు చూసిన ప్రేక్షకులకు పాండిరాజ్ సినిమా అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయనే ఆలోచన ఉంటుందనడంలో సందేహం లేదు. ET సినిమా విషయానికి వస్తే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండటంతో పాటు.. నా సినిమాల్లో మీరు ఊహించని విధంగా.. ఇప్పటి వరకు చూడని మాస్ ఎలిమెంట్స్‌ను ఈ సినిమాలో చూస్తారు. పాన్ ఇండియా ప్రేక్షకులు ఎలాంటి మాస్ మూవీస్‌లను చూడాలని కోరుకుంటారో అలాంటి ఎలిమెంట్స్‌ను అన్నింటితో ఈ సినిమాలో తెరకెక్కించాం. యాక్షన్ ఎలిమెంట్స్‌లోనూ ఓ ఎమోషన్‌ను జోడించాం. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.
మహిళల గురించి చెప్పే సినిమా ఇది. ఎనిమిదవ తరగతి నుంచి పై చదువుకు కాలేజ్ వెళ్లే అమ్మాయిలను ఇంటి నుంచి బయటకు పంపేటప్పుడు మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రుల్లో ఓ సంఘర్షణ ఉంటుంది. ఓ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలి. అనే విషయంతో పాటు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లకి చెప్పకుండా దాచకుండా ధైర్యంగా సమస్యను చెప్పేలా ఉండే సినిమా. ఏదో కమర్షియల్ సినిమాలా ఎంజాయ్ చేసి చూసి వెళ్లే పోవాలనుకునే సినిమా అయితే మాత్రం కాదు. మహిళల ఎదుర్కొనే సమస్యకు జవాబును సూచించే సినిమా అని గట్టిగా చెప్పగలను. సూర్యగారిని కలిసి కథ నెరేట్ చేసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చెప్పాల్సిన కథ ఇదే సార్. మెయిన్ కాన్సెప్ట్ సూపర్‌గా ఉంది. నా సినిమా ద్వారా ఈ విషయం చెప్పాలనుకున్నందుకు మీకు థాంక్స్ చెప్పాలని అన్నారు సూర్య.
ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఆయన్ని చూడమని చెప్పగానే.. నాకు కాస్త ఫీవర్‌గా అనిపిస్తుంది. అదీ కాకుండా మా ఇంట్లో పనిచేసే ఇద్దరు పని వాళ్లకు కూడా పాజిటివ్ అని తేలింది. మీరు పిలిచారు కాబట్టి వస్తాను. దూరంగా కూర్చుని సినమా చూస్తాను అన్నారు. అలా ఆయన మాస్క్ అన్నీ వేసుకుని మిక్సింగ్ థియేటర్‌కు వచ్చి దూరంగా కూర్చుని సినిమా చూశారు. సినిమా పూర్తయిన తర్వాత వేగంగా వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని థాంక్యూ సార్.. లవ్ యు అని చెప్పారు. సూర్యగారికి అంత బాగా నచ్చింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సూర్యగారు సినిమా చూసే సమయానికి తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్‌ను పెట్టి డబ్బింగ్ చెప్పించేశాం. కానీ ఆయనకు చాలా బాగా నచ్చడంతో.. మళ్లీ ఆయనే సొంతంగా డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకుని.. డబ్బింగ్ చెప్పారు. తమిళంలో కంటే తెలుగు డబ్బింగ్ సమయంలోనే ఎక్కువ ఎంజాయ్ చేసి మరీ చెప్పారు. అంత బాగా సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యారు.
మరిన్ని ఇక్కడ చదవండి :