Prabhas: ప్రభాస్ బర్త్ డేకి ఊహించని సర్‌ప్రైజ్ ఉంటుందంటూ హింట్ ఇచ్చిన డైరెక్టర్

|

Sep 09, 2022 | 8:22 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా నిరాశపరచడంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు.

Prabhas: ప్రభాస్ బర్త్ డేకి ఊహించని సర్‌ప్రైజ్ ఉంటుందంటూ హింట్ ఇచ్చిన డైరెక్టర్
Prabhas
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా నిరాశపరచడంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ప్రభాస్.. ఆ షూటింగ్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. సలార్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్.  ఈ సినిమా తో పాటే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఆదిపురుష్ టైటిల్ తో రానున్న ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రభాస్ కు జోడీగా కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు.. అదేవిధంగా సందీప్ రెడీ వంగ డైరెక్షన్ లో స్పిరిట్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నాడు డార్లింగ్.

ఇదిలా ఉంటే ప్రభాస్ పుట్టిన రోజు త్వరలో రానుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న ఓల్డ్ సినిమా రీరిలీజ్ లో భాగంగా బిల్లా సినిమాను రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఇదే రోజు డార్లింగ్ పుట్టిన రోజు పురస్కరించుకొని అయన కొత్త సినిమాలనుంచి అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వనున్నారు.అయితే ఆదిపురుష్ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయమని ఎప్పటి నుంచో అభిమానులు అడుగుతున్నారు. కనీసం డార్లింగ్ పుట్టిన రోజున అయినా లుక్ రిలీజ్ చేయమని రిక్వస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ బర్త్ డేకి కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాదని.. అందరూ సర్ ప్రైజ్ అయ్యే ఒక అప్డేట్ రాబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.