
ప్రభాస్ కథానాయకుడిగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ తదితర స్టారాది స్టార్లు ఈ సినిమాలో నటించారు. గతేడాది భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహా భారతంతో పాటు భవిష్యత్తును, పురాణాలను మిళితం చేసి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కాగా కల్కి సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం రెండో పార్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ క్రేజీ సీక్వెల్ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చాడు.తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సమయంలో, కొంతమంది మీడియా వ్యక్తులు అతనిని చుట్టుముట్టారు. కల్కి 2 సినిమా పనులు ఎంతవరకొచ్చాయని అడిగారు. దీనికి నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా స్క్రిప్ట్ సిద్ధమవుతోందని అన్నారు. కొన్ని నెలల్లో స్క్రిప్ట్ ఫైనల్ అవుతుందని, ఈ ఏడాది చివరి నాటికి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం తాను దర్శకత్వం వహించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా రీ-రిలీజ్ ప్రమోషన్ సందర్భంగా కూడా కల్కి 2 పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు నాగ్ అశ్విన్. ‘కల్కి 2’ సినిమాలో ప్రభాస్ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందని అన్నారు. అంతే కాదు, ఈ చిత్రం ప్రధానంగా కర్ణుడు, అశ్వత్థామ పాత్రల గురించి ఉంటుందన్నాడు. అలాగే కమల్ హాసన్ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంటుందని పేర్కొన్నాడు.
Spotted Bhairava?
He’s chilling at Khaitalapur Flyover. Tag us when you see him! 🔥Kalki Watch & Win:
🔗https://t.co/sURDvRNee8World Television Premiere #Kalki2898AD Tomorrow 5:30Pm, Only on #ZeeTelugu#SpotBhairavaInHyderabad #Kalki2898ADWatchandWinContest… pic.twitter.com/WLSsqDqr34
— ZEE TELUGU (@ZeeTVTelugu) January 11, 2025
ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత అతను హను రాఘవపూడి సినిమాతో బిజీ కానున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలను కూడా ప్రభాస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. వీటి తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాలోనూ డార్లింగ్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. హోంబాలే సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.