పెదరాయుడు సినిమా ఆ చేయాల్సింది కానీ మిస్ అయ్యింది.. అసలు విషయం చెప్పిన దర్శకుడు

తెలుగు సినిమాల్లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన సినిమాల్లో పెదరాయుడు సినిమా ఒకటి.. మోహన్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా పెదరాయుడు . రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు డ్యూయల్ రోల్ లో నటించారు.

పెదరాయుడు సినిమా ఆ చేయాల్సింది కానీ మిస్ అయ్యింది.. అసలు విషయం చెప్పిన దర్శకుడు
Peddarayudu

Updated on: Jan 28, 2026 | 11:28 AM

టాప్ డైరెక్టర్స్‌లో కే ఎస్ రవికుమార్ ఒకరు. ఈ సీనియర్ దర్శకుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవికుమార్. ఈ స్టార్ డైరెక్టర్ ఎక్కువగా తమిళ్ లో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సినిమాల గురించి చెప్పాలంటే ఒకే ఒక్క సినిమా చాలు. అదే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 1998లో రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ, చిరంజీవి హీరోగా తమిళ సినిమాకు రీమేక్ చేసిన స్నేహం కోసం, కమల్ హీరోగా తెనాలి, నాగార్జున హీరోగా బావ నచ్చాడు, రాజశేఖర్ హీరోగా విలన్ లాంటి సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రవికుమార్.

గతంలో కేఎస్ రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పెదరాయుడు సినిమా రీమేక్ హక్కులు, చిరంజీవి స్నేహం కోసం చిత్రం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. స్నేహం కోసం చిత్రంలో చిరంజీవి మెగాస్టార్ హోదాలో ఉండి కూడా, ఒక నిరాడంబరమైన పాత్రను అంగీకరించడంపై దర్శకుడు రవికుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగులో అభిమానులు తమ హీరోను కొంచెం తగ్గించి చూపించే పాత్రలను ఆమోదించరనే అభిప్రాయం ఉన్నప్పటికీ, చిరంజీవి ఈ పాత్రను అద్భుతంగా పోషించారని అన్నారు. ఈ చిత్రం కేవలం 42 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుని, 58 కేంద్రాలలో 100 రోజులు ఆడిందని తెలిపారు.

పెదరాయుడు సినిమా రీమేక్ హక్కుల వివాదంపై మాట్లాడుతూ.. తమిళ చిత్రం నాట్టమై రీమేక్ హక్కుల కోసం చిరంజీవి మొదట ఆసక్తి చూపారని, అయితే రజనీకాంత్ జోక్యం చేసుకుని ఆ హక్కులను మోహన్ బాబుకు ఇవ్వాలని సూచించడంతో అది మిస్ అయ్యిందని రవికుమార్ వెల్లడించారు. రజనీకాంత్ సలహాను గౌరవించి, ఆ హక్కులు మోహన్ బాబుకు వెళ్లాయని తెలిపారు. ఆ తర్వాత చిరంజీవి నట్పుకాగా చూసి దాని డబుల్ యాక్షన్ పాత్రకు ఆకర్షితులై స్నేహం కోసం చేయాలని నిర్ణయించుకున్నారని, అప్పుడు ఆయన చేస్తున్న మూడు, నాలుగు చిత్రాలను పక్కనపెట్టి దీనికి ప్రాధాన్యత ఇచ్చారని రవికుమార్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..