Krishna Vamsi: ఎన్టీఆర్తో ఆ సినిమా.. ముందు నాకే నచ్చలేదు.. డైరెక్టర్ కృష్ణవంశీ..
దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో అందమైన, సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు తగ్గిపోయాయి. చివరగా రంగమార్తండా సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన వృత్తిపరమైన, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. తన సినిమాల్లో సింధూరం ఇష్టమని, రాఖీలో తన పని నచ్చలేదని వెల్లడించారు. "లైఫ్ వితౌట్ ఫిల్మ్స్" ఊహించుకోలేనని, తన అభిమాన దర్శకుడు శేఖర్ కమ్ముల అని తెలిపారు.

దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తన వృత్తి జీవితం, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాపై తన అభిప్రాయాలతో పాటు, తన కెరీర్‌లో ఇష్టమైన, ఇష్టం లేని చిత్రాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన సినిమాల్లో తనకు బాగా నచ్చిన చిత్రం ఏదని అడగ్గా సింధూరం సినిమా తనకు చాలా ఇష్టమని అన్నారు. అలాగే తాను తెరకెక్కించిన చిత్రాల్లో తనకు నచ్చని మమూవీ సముద్రంతో పాటు రాఖీ అని అన్నారు. ముఖ్యంగా ఈ రెండు చిత్రాల్లో తన దర్శకత్వ పనితీరు పట్ల తనకు సంతృప్తి లేదని స్పష్టం చేశారు. “లైఫ్ వితౌట్ ఫిల్మ్” లేదా “లైఫ్ వితౌట్ వైఫ్” – ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోమని అడగ్గా, కృష్ణవంశీ క్షణాల్లో “లైఫ్ వితౌట్ వైఫ్” అని సమాధానం ఇచ్చారు. సినిమాలను మినహాయించి తన జీవితాన్ని ఊహించుకోలేనని అన్నారు. తన ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఎవరు అని అడగ్గా, నాగార్జున, సుంకర మధుమురళి, కృష్ణవంశీ, ఎన్ రామలింగేశ్వర రావు, కే ఎల్ నారాయణ పేర్లలో నుండి, నిన్నే పెళ్ళాడతా చిత్రంలో నాగార్జునను ఎంపిక చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
తాను వర్క్ చేసిన హీరోలలో సినిమా అంటే ప్రాణం పెట్టే వారిలో ఎవరు ముందుంటారని అడగ్గా, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, మహేష్ బాబుల పేర్లలో ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చారు. తన జనరేషన్‌లో తన ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అని అడగ్గా, రాజమౌళి, వినాయక్, శేఖర్ కమ్ముల, పూరి జగన్నాథ్‌లలో శేఖర్ కమ్ముల అని స్పష్టం చేశారు. శేఖర్ కమ్ముల చిత్రాలలో ఉండే తీయదనం, నిరాడంబరమైన రొమాన్స్, వాస్తవికత, మరియు ఏ కఠినత్వం లేని సున్నితమైన కంపోజిషన్ తనకెంతో నచ్చుతాయని వివరించారు. షూటింగ్ లేనప్పుడు బయటకు వెళ్తారా అని అడగ్గా, తన ఇంట్లోనే తన “బాసెస్” ఉంటారని, వారు నిర్ణయిస్తారని సరదాగా సమాధానమిచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..
రాఖీ సినిమా విషయానికి వస్తే.. 2006లో డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా చిత్రం. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కథానాయికుడిగా కనిపించగా.. ఛార్మీ, ఇలియానా హీరోయిన్లుగా నటించారు. మహిళలపై జరిగే అన్యాయాలు, వేధింపుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. రైల్వే స్టేషన్ సీన్, కోర్టు సన్నివేశం, క్లైమాక్స్ డైలాగ్స్ లో ఆయన పలికించిన హావభావాలు, ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..
ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..
