AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arundhati Movie : అరుంధతి సినిమాకు అనుష్కను వద్దని అందరూ అన్నారు.. కానీ నేను నమ్మాను.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క కెరీర్ మలుపు తిప్పిన సినిమా అరుంధతి. తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఈ మూవీతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. గతంలో అనుష్క గురించి డైరెక్టర్ కోడి రామకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Arundhati Movie : అరుంధతి సినిమాకు అనుష్కను వద్దని అందరూ అన్నారు.. కానీ నేను నమ్మాను.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..
Kodi Ramakrishna, Anushka S
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2026 | 2:01 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘అరుంధతి’ ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం. గ్రాఫిక్స్, అద్భుతమైన నటన, కథా బలంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్క శెట్టి నటన అద్భుతమనే చెప్పాలి. అయితే, ఈ పాత్ర కోసం అనుష్కను ఎలా ఎంచుకున్నారో , సినిమా చిత్రీకరణ సమయంలో పడిన కష్టాలను ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కోడి రామకృష్ణ ప్రకారం, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి బడ్జెట్ భారం కాకూడదని , గ్రాఫిక్స్ లేకుండా ఒక మంచి సినిమా తీయాలని మొదట భావించారు. ఆ సమయంలో ఈ కథ అనుకున్నారు. అరుంధతి పాత్ర కోసం ఎందరినో పరిశీలించిన తర్వాత అనుష్కను ఖరారు చేశారు. అయితే, అప్పటివరకు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన అనుష్క, ఇంతటి పవర్‌ఫుల్ , చారిత్రాత్మక పాత్రను చేయగలదా అని చాలా మంది సందేహించారని కానీ అనుష్కపై నమ్మకంతో ఆమెనే ఎంపిక చేశానని చెప్పుకొచ్చారు. ఈ పాత్ర కోసం అనుష్క ఎంతో శ్రమించిందని చెప్పుకొచ్చారు .

దాదాపు 10 కేజీల బరువున్న కాస్ట్యూమ్స్ , ఆభరణాలు ధరించి, చేతిలో కత్తి పట్టుకుని నటిస్తున్నప్పుడు ఆమె పాత్రలోకి పూర్తిగా లీనమైపోయేదని గుర్తు చేసుకున్నారు. ఎమోషనల్ సీన్స్,డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆమె చూపించిన నిబద్ధత అమోఘం. షూటింగ్ సమయంలో కళ్లు తిరిగి పడిపోయినప్పటికీ, ఏమాత్రం అలసట చూపించకుండా పాత్ర కోసం ప్రాణం పెట్టేది.కేవలం అనుష్క మాత్రమే కాకుండా, విలన్ పాత్ర పోషించిన సోనూ సూద్ కూడా ఎంతో కష్టపడ్డారు. ఆయనకు టాటూలు వేయడానికి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం పట్టేదని, రాత్రి 12 గంటల వరకు ఆ గెటప్‌లోనే ఉండేవారని దర్శకుడు గుర్తుచేసుకున్నారు.

సాయాజీ షిండే కూడా విభిన్న గెటప్‌లలో అద్భుతంగా నటించారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అభిరుచికి తగ్గట్టుగా సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ కలిసి కష్టపడటం వల్లే ‘అరుంధతి’ ఒక ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిందని అన్నారు. తన స్నేహితుడైన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇంతటి భారీ విజయం దక్కడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని కోడి రామకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం..
దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం..
గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!
గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!
నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. మంచిర్యాల ఆటో డ్రైవర్ పాదయాత్ర
నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. మంచిర్యాల ఆటో డ్రైవర్ పాదయాత్ర
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు