ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ (73) కన్నుమూత

ప్రముఖ నటుడు, దర్శకుడు K.భాగ్యరాజ్ కన్నుమూశారు.  దర్శకుడు భాగ్యరాజ్ (73)ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణంతో ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. భాగ్యరాజ్ గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగానే కాదు నటుడిగానూ 75 సినిమాల్లో నటించారు భాగ్యరాజ్.

ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ (73) కన్నుమూత
Director K. Bhagyaraj

Updated on: Jun 27, 2026 | 12:06 PM

ప్రముఖ నటుడు, దర్శకుడు K.భాగ్యరాజ్ కన్నుమూశారు.  దర్శకుడు భాగ్యరాజ్ (73)ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణంతో ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. భాగ్యరాజ్ గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగానే కాదు నటుడిగానూ 75 సినిమాల్లో నటించారు భాగ్యరాజ్. అలాగే 25 చిత్రాలకు దర్శకత్వం వహించారు. భాగ్యరాజ్ మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది భాగ్యరాజ్ మృతికి సినీ ప్రముఖులు, అభిమానుల సంతాపం తెలుపుతున్నారు.

భాగ్యరాజ్ దర్శకత్వం, నటనతో పాటు కొన్ని తెలుగు, హిందీ సినిమాలు, సీరియళ్ళకు కూడా రచించారు. అలాగే కొన్ని నవలలు కూడా రచించారు. ముంధనై ముడిచ్చు (1983) అనే సినిమాకు గాను తమిళనాడు ప్రభుత్వం తరఫున ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు బాగ్యా రాజ్. అలాగే తెలుగులో చిలిపి పెళ్ళాం, మేం వయసుకు వచ్చాం, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, డిటెక్టివ్‌, అల్లంత దూరాన, 35 చిన్న కథ కాదు సినిమాల్లో నటించారు భాగ్యరాజ్ .

ఇవి కూడా చదవండి

భాగ్యరాజ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ” నటుడు భాగ్యరాజా మరణవార్త వినడం నమ్మశక్యంగా లేదు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మాటల్లో చెప్పలేనంత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మొన్ననే మేమిద్దరం గోవాలో కుష్బూ కూతురు పెళ్లిలో కలిశాం.. నవ్వుతూ, సరదాగా జోకులు వేసుకుంటూ, ఫోటోలు తీసుకున్నాము. భాగ్యరాజ్ గారు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండేవారు. ఈ ఉదయం ఆయన మరణవార్త వినడం నమ్మశక్యంగా లేదు. ఒక ప్రతిభావంతుడైన చిత్రనిర్మాత, అద్భుతమైన స్క్రీన్‌ప్లే రచయిత, మరియు గొప్ప నటుడు, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పూర్ణిమ గారికి, శాంతనుకు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ నష్టాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలి. శాంతిగా విశ్రాంతి తీసుకోండి, నా ప్రియ మిత్రమా. మిమ్మల్ని చాలా మిస్ అవుతాము” అంటూ మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us