Harish Shankar: చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో హరీష్ శంకర్ సినిమా.. డైరెక్టర్ క్రేజీ ఆన్సర్..

ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమా అప్డేట్స్ షేర్ చేయడంతోపాటు.. అభిమానుల ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు చెబుతుంటారు. తాజాగా మరోసారి నెటిజన్స్ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు ఈ క్రమంలో పవన్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Harish Shankar: చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో హరీష్ శంకర్ సినిమా.. డైరెక్టర్ క్రేజీ ఆన్సర్..
Chiranjeevi, Ram Charan, Ha

Updated on: Nov 25, 2023 | 3:43 PM

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‏గా ఉండే టాలీవుడ్ దర్శకులలో హరీశ్ శంకర్ ఒకరు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ చిత్రీకరణ కొద్ది రోజుల క్రితం బ్రేక్ పడింది. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమా అప్డేట్స్ షేర్ చేయడంతోపాటు.. అభిమానుల ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు చెబుతుంటారు. తాజాగా మరోసారి నెటిజన్స్ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు ఈ క్రమంలో పవన్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హరీశ్ శంకర్ .

ట్విట్టర్ వేదికగా అభిమానులతో హరీశ్ శంకర్ ముచ్చటించారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై ఎందుకు స్పందిస్తారు ? అని ఓ నెటిజన్ అడగ్గా.. 12 గంటలు విశ్రాంతి లేకుండా పనిచేశాక సోషల్ మీడియాలో లాగిన్ అవుతా అని.. తనపై ట్రోల్స్ చేసే వాళ్లు లేకపోతే నేనేమైపోతానో వాళ్ల వల్లే తనకు ఒత్తిడి నుంచి ఉపశమనం వస్తుందని అన్నారు. అలాగే వెంకటేశ్ హీరోగా బారిస్టర్ పార్వతీశం స్టోరీని తెరకెక్కిస్తారా ? అని మరో నెటిజన్ అడగ్గా.. చలం రాసిన మైదానం సినిమాగా తీయాలని ఇండస్ట్రీకి వచ్చానని.. కానీ ఇప్పటివరకు ఆ సినిమా తీయలేకపోయానని అన్నారు. సినిమా మనల్ని ఎంచుకుంటుంది.. కానీ మనం సినిమాలను ఎంచుకోలేం అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కిస్తారా ? అని అడగ్గా.. అందులో పవన్ కళ్యాణ్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలను అందుకుంటుందా ?.. అంటే .. అందుకునేలా చేసే పూర్తి బాధ్యత నాది అన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గతంలో హరీశ్ శంకర్, పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.