Oke Oka Jeevitham: ఆ హీరో సినిమాపై సీతారామం డైరెక్టర్ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హానురాఘవపూడి..

|

Sep 08, 2022 | 7:33 PM

ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ రేపు అంటే సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా చూసిన డైరెక్టర్ హాను రాఘవపూడి ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Oke Oka Jeevitham: ఆ హీరో సినిమాపై సీతారామం డైరెక్టర్ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హానురాఘవపూడి..
Hanu Raghavapudi
Follow us on

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఒకే ఒక జీవితం(Oke Oka Jeevitham). డైరెక్ట్ర శ్రీకార్తిక్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో రీతూవర్మ కథానాయికగా నటిస్తుండగా.. అక్కినేని అమల కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమా ప్రివ్యూ చూసిన హీరో నాగార్జున, అఖిల్ ఎమోషనల్ అయిన సంగతి కూడా తెలిసిందే. ట్రావెల్ కథగా యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్‏గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నాజర్, అలీ , మధునందన్ కీలకపాత్రలలో నటించారు. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ రేపు అంటే సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా చూసిన డైరెక్టర్ హాను రాఘవపూడి ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఒకే ఒక జీవితం సినిమా ప్రివ్యూ చూశాను. ఎంతో అద్భుతంగా ఉంది. డైరెక్టర్ శ్రీకార్తిక్ ప్రతి ఫ్రేమ్ ను అందంగా తెరకెక్కించారు. హీరో శర్వానంద్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్, అమల ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఇలాంటి కథలకు సౌండ్ డిజైన్ చాలా ముఖ్యం. అలాంటిది ఈ మూవీకి మ్యూజిక్ అదిరిపోయింది. సంగీతం అందించినవారికి ప్రత్యేక అభినందనలు. స్టోరీ ఆధ్యంతం మనసుని కదిలించింది. ఇక రేపు విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఈ సినిమా చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అంటూ స్పెషల్ నోట్ షేర్ చేశారు డైరెక్టర్. ఇక మరీ ఈ సినిమాతో శర్వానంద్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.