Director Gunashekar: అల్లు అర్జున్‏తో ఆ సినిమా డిజాస్టర్ కారణం అదే.. అలా చేసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది.. డైరెక్టర్ గుణశేఖర్..

ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో సక్సెస్ ఫుల్ దర్శకులు చాలా మంది ఉన్నారు. అందులో గుణశేఖర్ ఒకరు. చూడాలని ఉంది.. ఒక్కడు వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల శాకుంతలం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు యుఫోరియా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Director Gunashekar: అల్లు అర్జున్‏తో ఆ సినిమా డిజాస్టర్ కారణం అదే.. అలా చేసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది.. డైరెక్టర్ గుణశేఖర్..
Gunasekhar, Allu Arjun

Updated on: Jan 25, 2026 | 12:05 PM

‏డైరెక్టర్ గుణశేఖర్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన దర్శకుడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చూడాలని ఉంది.. ఒక్కడు, రుద్రమదేవి వంటి హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ డ్రామా శాకుంతలం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు యుఫోరియా సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇందులో సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గుణశేఖర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే గతంలో తాను తెరకెక్కించిన సినిమాల గురించి చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..

అలాగే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమా గురించి మాట్లాడారు. ఆ సినిమా విడుదల వరకూ కథానాయిక వివరాలు చెప్పకపోవడంపై స్పందిస్తూ.. “వరుడు కథలో హీరో.. హీరోయిన్ ను పెళ్లి పీటలపైనే చూస్తానంటాడు..అందుకే థియేటర్ కు వచ్చేవరకు హీరోయిన్ ఎవరో ప్రేక్షకులకు తెలియకుండా ఉండాలని అనుకున్నాను. ఆమె కొత్త నటి కావడంతో సినిమాలోనే చూపించాలనుకున్నాను.. సాధ్యం కాదన్నారు. కానీ నేను చూసుకుంటానని అన్నాను.. అలా చేయడంతో సినిమాపై మంచి హైప్ వచ్చింది. ఆ హీరోయిన్ ఎవరట అని చర్చించుకున్నారు. హీరోయిన్ గురించి తెలుసుకోవడానికి నా భార్యకు కూడా కాల్స్ వచ్చాయి. సినిమాకు ఎంత ప్లస్ అయ్యిందో అదే మైనస్ అయ్యింది.. హీరోయిన్ బాగుంది.. కానీ అడియన్స్ అంచనాలకు ఆమె సరిపోలేదు” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

అలాగే వరుడు సినిమాను కేవలం ఐదు రోజుల పెళ్లి కథాంశంతో మాత్రమే తెరకెక్కించాలని అనుకున్నాను. అందుకు అల్లు అర్జున్ కూడా ఒప్పుకున్నారు. కానీ ఆ సినిమాను యాక్షన్ మూవీగా మార్చేశాము. వేటూరి గారు నాకు ఇచ్చిన పుస్తకం ఆధారంగా వరుడు కథ రాసుకున్నాను. కానీ కమర్షియల్ మూవీగా తెరకెక్కించడానికి యాక్షన్ జత చేయడంతో సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు. నేను అనుకున్న విధంగా సినిమా తీసుకుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..

 

ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..