
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రానికి అఖండ-2 తాండవం చిత్ర యూనిట్. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను గురువారం దర్శించుకున్నారు. అనంతరం స్వామి అమ్మ వారిలో దర్శనార్థం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న చిత్ర యూనిట్ కు ఆలయ రాజగోపురం వద్ద ఆలయం మర్యాదలతో ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు. అనంతరం స్వామి అమ్మ వారి దర్శనార్థం వచ్చిన చిత్ర యూనిట్ స్వామి అమ్మవార్లకు స్వామివారికి అభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
అనంతరం అమ్మవారి వేద ఆశీర్వచనం మండపం నందు అతిధులకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం తెలపగా స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను ప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. తదుపరి మీడియా సమావేశంలో డైరెక్టర్ బోయపాటి శీను మాట్లాడుతూ విజ్ఞాలన్ని తొలగి అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చాము దర్శనం చేసుకున్నామని తెలుపుతూ ప్రేక్షకులు సినిమాను చూసి ఆనందించాలని కోరారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..