Anil Ravipudi : హీరో అవతారమెత్తనున్న మరో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. త్వరలోనే..

|

Feb 10, 2021 | 12:25 AM

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుల్లో యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఒకరు. వరుసగా సినిమాలు చస్తూ హిట్లు అందుకుంటున్న ఈ దర్శకుడు. గతః ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు..

Anil Ravipudi : హీరో అవతారమెత్తనున్న మరో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. త్వరలోనే..
Follow us on

Anil Ravipudi : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుల్లో యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఒకరు. వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు అందుకుంటున్న ఈ దర్శకుడు. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో  సాలిడ్ హిట్ అందుకున్న అనీల్. ఇప్పుడు సూపర్ హిట్ సినిమా ఎఫ్ 2 సీక్వెల్  ఎఫ్3తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే త్వరలోనే అనీల్ హీరో అవతారమెత్తనున్నాడని వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.

ఇప్పటికే చాలా మంది దర్శకులు హీరోలుగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన చేస్తున్న ‘ఎఫ్ 3’ సినిమా ఆగస్ట్ 27న విడుదల కానుంది. ఎఫ్ 3తో పాటు బాలయ్యతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. అంతేకాదు సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబుతో మరో సినిమా చేయాలనీ చూస్తున్నాడు. అయితే తనకు హీరో కావాలని లేదని.. ఏదైనా మంచి పాత్ర దొరికితే మాత్రం కచ్చితంగా చేస్తానంటున్నాడు. ఆ ఆశ అయితే ఉందంటున్నాడు ఈయన.  త్వరలో ఈ దర్శకుడు హీరో అవతారమెత్తుతాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: రాధేశ్యామ్ టీజర్‌ వచ్చేది ఆ రోజే… క్లారిటీ ఇచ్చిన బుట్టబొమ్మ.. డబ్బింగ్‌ చెబుతూ..