Anil Ravipudi: ఎఫ్ 2 సినిమా మాకు పెద్ద శత్రువు.. రెండేళ్లు శ్రమించాం.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్..

ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించగా.. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా

Anil Ravipudi: ఎఫ్ 2 సినిమా మాకు పెద్ద శత్రువు.. రెండేళ్లు శ్రమించాం.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్..
Anil Ravipudi
Follow us

|

Updated on: May 22, 2022 | 9:33 AM

ఎఫ్3 సినిమా విషయంలో ఎఫ్ 2 మూవీ మాకు అది పెద్ద శత్రువు అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi).. అంతకు మించి ప్రేక్షకులను నవ్వించాలన్న ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు.. వెంకటేశ్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించగా.. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించారు… ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం హైదరాబాద్ శిల్పా కళా వేదికలో ఎఫ్ 3 ఫంటాస్టిక్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడారు..

” ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెండేళ్లు కష్టపడ్డాం. ఈ సినిమా విషయంలో మాకు పెద్ద శత్రువు ఎఫ్ 2. ఎందుకంటే ఆ మూవీని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. దాన్ని మించి నవ్వించాలన్న ఉద్ధేశ్యంతోనే స్క్రిప్ట్ దశ నుంచే ఎంతో కష్టపడి పనిచేశాం.. మెహ్రీన్ కు ఈ సినిమాతో మరింత పేరు వస్తుంది.. రాజేంద్రప్రసాద్, సునీల్, అలీ.. ఇలా దాదాపు 30 మంది నటీనటులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు..అంతేకాకుండా..ఈ సినిమాతో డబ్బు విలువ కూడా తెలుసుకుంటారు. వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ ఇంతా ఉందా అనిపించింది.. అలాగే.. వెంకటేశ్ గారు సెట్ లోకి రాగానే అందరికీ ఎనర్జీ వస్తుంది. కామెడీ చేసేటప్పుడు తన ఇమేజ్ ను పక్కన పెట్టి చిన్నపిల్లాడిలా చేస్తారు. ఎఫ్ 2 లో ఎంత నవ్వించారో.. అంతకు పది రెట్లు ఈ సినిమాతో నవ్విస్తారు. రెండేళ్ళు మనందరం చాలా ఒత్తిడిని అనుభవించాం.. ఇప్పుడు థియేటర్లకు వెళ్లి ఆ ఒత్తిడిని మర్చిపోయి హాయిగా నవ్వుకోండి. ” అంటూ చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.రాజేంద్రప్రసాద్, ప్రగతి, తులసి, అలీ, పృథ్వీ కీలకపాత్రలలో నటించారు.

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు