శర్వానంద్ ‘శ్రీకారం’ మూవీ నిజాంగానే కాపీ కొట్టారా ?.. అసలు విషయం చెప్పిన ఆర్ఎక్స్100 డైరెక్టర్…

|

Mar 13, 2021 | 10:10 AM

Sreekaram Movie Success Meet: శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం శ్రీకారం. మహాశివరాత్రి కానుకగా

శర్వానంద్ శ్రీకారం మూవీ నిజాంగానే కాపీ కొట్టారా ?.. అసలు విషయం చెప్పిన ఆర్ఎక్స్100 డైరెక్టర్...
Sreekaram
Follow us on

Sreekaram Movie Success Meet: శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం శ్రీకారం. మహాశివరాత్రి కానుకగా విడుదలైన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా.. బి.కిశోర్ అనే కొత్త దర్శకుడి తెరకెక్కించారు. వ్యవసాయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఎమోషనల్‏గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు డైరెక్టర్. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్‏తోపాటు ఇందులో కొత్తగా ఏం లేదని.. పలు సినిమాలను కాపీ కొట్టారని విమర్శలు వస్తున్నాయి.

తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు చిత్రయూనిట్. ఇందులో పాల్గొన్న ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మహేష్ మూవీ మహర్షిని పోలీ ఉందంటూ వస్తున్న వార్తలపై తనదైన శైలీలో స్పందించారు. నేను ఈ మూవీని రాత్రి చూశా. మార్నింగ్ షో చూసిన నా సన్నిహితులు నాకు ఫోన్ చేసి.. అచ్చం మహర్షిలా ఉందని చెప్పారు. నేను ఇలాంటి వాళ్లకు చెప్పున్నది ఒక్కటే.. 2016లోనే నేను ఈ చిత్రాన్ని చూశాను. శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్ ఇది. ఈ స్టోరీ ప్రస్తుతం వస్తున్న సినిమాలకంటే ముందే వచ్చింది. అది కూడా కిశోరే రూపొందించాడు. దానిని మరింత డెవలప్ చేసి ఇప్పుడు మూవీగా మీ ముందుకు తీసుకువచ్చాడు. మొదటి ప్రయత్నంలోనే ఇలాంటి స్టోరీని ఎంచుకోవడం మాములు విషయం కాదు. నాకు వ్యవసాయం గురించి తెలుసు. వాళ్ళ బాధలు తెలుసు. 15 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేయలేక.. ఇక్కడికి వచ్చి హోటల్స్ పెట్టుకున్న కుటుంబాల గురించి నాకు తెలుసు. అందుకే ఈ సినిమాకు బాగా అడిక్ట్ అయిపోయా. ఇందులో శర్వానంద్ నటన సూపర్. నేను శర్వానంద్ కలిసి మహా సముద్రం చేస్తున్నాం. ఈ మూవీకి.. ఆ సినిమాకు శర్వానంద్ మొత్తం అపోజిట్. కానీ శర్వానంద్ నటన చూసి నేను షాకయ్యా. ఇందులో రావు రమేష్, నరేష్, సాయి కుమార్ అద్బుతంగా నటించారు. ఈ మూవీని మరింత ఆదరించండి అంటూ చెప్పుకోచ్చాడు. దీనిని బట్టి చూస్తే.. శ్రీకారం షార్ట్ ఫిల్మ్ ఆధారంగానే మహర్షి, భీష్మ లాంటి సినిమాలు పుట్టుకోచ్చాయా అనే సందేహాన్ని లేవనెత్తారు అజయ్. కానీ ఈ సినిమాల పేర్లను ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా చెప్పుకోచ్చాడు డైరెక్టర్.

Also Read:

Karthika Deepam March 12 Episode: మురళికృష్ణ, కార్తీక్ మధ్య మాటల యుద్ధం.. ఎమోషనల్‏గా మారిన డాక్టర్ బాబు..