Aishwarya Rajinikanth: మా సినిమా అందుకే ఫ్లాప్ అయ్యింది.. తప్పుమాదే.. ఐశ్వర్య రజినీకాంత్ కామెంట్స్

|

Mar 13, 2024 | 3:28 PM

సినిమా విడుదలకు ముందే ఐశ్వర్యకు పెద్ద షాక్ తగిలింది.. 21 రోజుల షూటింగ్ సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ కనిపించలేదట. హార్డ్ డిస్క్ మిస్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అప్పట్లో దీని పై పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు ఐశ్వర్య రజనీకాంత్ మరోసారి దీని గురించి మాట్లాడింది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Aishwarya Rajinikanth: మా సినిమా అందుకే ఫ్లాప్ అయ్యింది.. తప్పుమాదే.. ఐశ్వర్య రజినీకాంత్ కామెంట్స్
Aishwarya Rajinikanth
Follow us on

రజనీకాంత్ నటించిన ‘ లాల్ సలామ్’ గత నెలలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలకు ముందే ఐశ్వర్యకు పెద్ద షాక్ తగిలింది.. 21 రోజుల షూటింగ్ సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ కనిపించలేదట. హార్డ్ డిస్క్ మిస్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అప్పట్లో దీని పై పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు ఐశ్వర్య రజనీకాంత్ మరోసారి దీని గురించి మాట్లాడింది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘మేం చిత్రీకరించిన సన్నివేశాలు పోగొట్టుకున్నట్లు వచ్చిన వార్త నిజమే. 21 రోజుల పాటు చిత్రీకరించిన సన్నివేశాలను పోగొట్టుకున్నాం.. అది ఎలా జరిగిందో కూడా మాకు తెలియదు. సినిమా టీమ్ మొత్తానికి పెద్ద షాక్ ఇచ్చింది’ అని ఐశ్వర్య రజనీకాంత్ అన్నారు.

“మేము క్రికెట్ మ్యాచ్ షూట్ చేసాము, మ్యాచ్ షూట్ చేయడానికి 20 కెమెరాలను ఉపయోగించాము, నిజమైన క్రికెట్ మ్యాచ్ లాగా చూపించడానికి మేము చాలా డబ్బు ఖర్చు చేసాము. 20 కెమెరాల ఫుటేజీని కూడా తీశారు. అంతేకాదు, చాలా మంది నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరించాం కానీ అన్నీ పోయాయి. బాధ్యతారాహిత్యం వల్లే ఇలా జరిగిందని అంగీకరించాలి’ అని ఐశ్వర్య అన్నారు. ‘సీన్స్‌ పోగొట్టుకోవడంతో కథ విషయంలో చాలా రాజీ పడాల్సి వచ్చింది. చాలా సీన్స్‌ని డిఫరెంట్‌గా ఎడిట్‌ చేసి, డిఫరెంట్‌గా షూట్‌ చేయాల్సి వచ్చింది. చాలా మంది నటీనటుల పాత్రలు రూపురేఖలు మారిపోవడంతో మళ్లీ షూటింగ్ కూడా చేయలేకపోయాం. దర్శకురాలిగా చాలా పెద్ద కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది’ అని ఐశ్వర్య రజనీకాంత్ అన్నారు.

రజినీకాంత్ సహా మరికొందరు నటులు రీషూట్ చేద్దాం అన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. దాని బడ్జెట్ కూడా చాలా ఎక్కువ. కాబట్టి మేము ఎడిట్‌లోనే ప్రతిదీ సరిచేయడానికి ప్రయత్నించాము. ఆఖరికి సినిమా అనుకున్నంతగా పండలేదు. సినిమా పరాజయానికి ఇదీ ఒక కారణం’ అని ఐశ్వర్య అన్నారు. ఫిబ్రవరి 9న ‘లాల్ సలామ్’ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో రజనీకాంత్ మొయిద్దీన్ భవ పాత్రలో నటించారు. ఈ సినిమాలో క్రికెట్, మతం ఇతివృత్తం ఉంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రజనీకాంత్ అంత సూపర్ స్టార్ అయినప్పటికీ ఆయన క్రేజ్  సినిమాను కాపాడలేకపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.