ఏకంగా150 దేశాల్లో బ్యాన్.. ఆపై దర్శకుడి దారుణ హత్య.. ఈ సినిమా ఏంటి.? ఎక్కడ చూడోచ్చంటే..

ఓటీటీల పుణ్యమా అని ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటున్నాయి. అన్ని జోనర్స్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో విడుదలవుతున్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ సినిమా చాలా ఘోరంగా ఉంటుంది. ఏకంగా 150 దేశాలు ఆ సినిమాను బ్యాన్ చేశాయి.

ఏకంగా150 దేశాల్లో బ్యాన్.. ఆపై దర్శకుడి దారుణ హత్య.. ఈ సినిమా ఏంటి.? ఎక్కడ చూడోచ్చంటే..
Movie

Updated on: Feb 27, 2025 | 12:12 PM

ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే.. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటీటీలోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో అదరగొడుతున్న సినిమాల్లో హారర్, రొమాంటిక్, యాక్షన్ సినిమాలు నెటిజన్స్ ఎక్కువుగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఓ సినిమా ఇండస్ట్రీలోనే ఘోరమైన మూవీ. ఏకంగా 150 దేశాల్లో బ్యాన్ చేసిన సినిమా ఇది. అంతలా ఈ సినిమాలో ఏముంది.? ఎందుకు ఈ మూవీని బ్యాన్ చేసింది.? అనేక వివాదాలకు కారణం అయ్యింది ఈ సినిమా. కొన్ని సినిమాలు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అటువంటి సినిమాలను బ్యాన్ చేయడం సహజంగా జరుగుతుంటుంది. ఇది కూడా అలాంటి సినిమానే..

ఈ సినిమా ఎంత ఘోరమైన సినిమా అం తే ఏకంగా సినిమా రిలీజ్ ఆయిన తర్వాత దర్శకుడిని హత్య చేశారు. ఆ సినిమా పేరు ‘సాలో: ది 120 డేస్ ఆప్ సోడోమ్’. ఓ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మార్క్విస్ డి సేడ్ రాసిన 1785 నవల ‘ది 120 డేస్ ఆఫ్ సోడోమ్’ ఆధారంగా ఈసినిమా రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధానికి సబంధిచిన కథతో ఈ సినిమా తెరకెక్కడంతో ఈ సినిమా పై అనేక వివాదాలు నెలకొన్నాయి.

975లో విడుదలైన ఈ ఇటాలియన్ సినిమా కథ, సన్నివేశాల కారణంగా వివాదం అయ్యింది. అలాగే హింస, లైంగిక వేధింపుల సన్నివేశాల కారణంగా ఈ సినిమా పెద్ద దుమారాన్నే రేపింది. ఈ సినిమాలో కిడ్నప్ చేసిన కొంతమంది పిల్లలను క్రూరంగా హింసించడం వంటి హింసాత్మక దృశ్యాలు చూపించారు. సినిమాలో పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. పిల్లలు చూసే విధంగా లేకపోవడంతో చాలా దేశాలు ఈ సినిమాను నిషేదించాయి. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆ సినిమా దర్శకుడు పియర్ పాలో పసోలిని హత్య హత్య చేశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.