
సినిమా ఇండస్ట్రీలో అవకాశాకు సంబంధించి హీరోలు, హీరోయిన్లకు చాలా వ్యత్యాసముంటుంది. హీరోలకు వరుసగా రెండు, మూడు ఫ్లాఫులు వచ్చినా తర్వాతి సినిమా అవకాశాలు వస్తాయి. కానీ హీరోయిన్లకు అలాంటి పరిస్థితి ఉండదు. ఒక్క ఫ్లాఫ్ వచ్చినా తర్వాతి సినిమాల్లో అవకాశం రావడం కష్టమే. అందుకే చాలా మంది హీరోయిన్లు త్వరగా ఫేడవుట్ అయిపోతుంటారు. ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కెరీర్ ప్రారంభంలో వరుసగా సినిమాలు చేసిందీ అందాల తార. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ సక్సెస్ మాత్రం రాలేదు. చివరకు సీరియల్స్ లోనూ ట్రై చేసింది. వేరే రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. కట్ చేస్తే.. ఈ అందాల తార ఇప్పుడు గూగుల్ ఇండియాలో పనిచేస్తోంది. అది కూడా హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ రోల్‌లో. ఆమె పేరు మయూరి కాంగో.. పేరు చెచితే గుర్తు పట్టకపోవచ్చు.. కానీ మహేష్ నటించిన వంశీ సినిమా చెబితే చాలా మంది గుర్తు పడతారు. ఇందులో ఆమె మహేష్ స్నేహితురాలిగా, ఓ మోడల్ పాత్రలో కనిపిస్తుంది.
మయూరి బాలీవుడ్ లో తన సినిమా కెరీర్ ను ప్రారంభించింది. 1995లో నసీమ్ అనే హిందీ సినిమాలో మొదటిసారిగా కనిపించిందీ అందాల తార. ఆ తర్వాత పాపా కెహెతే హై, బేటాబీ, హోగీ ప్యార్ కీ జీత్, మేరే అప్నే, బాదల్, పాపా ది గ్రేట్, జంగ్, శికారీ తదితర సినిమాల్లో నటించింది. కెరీర్ స్టార్టింగ్ లో మయూరి నటించిన సినిమాలు బాగానే ఆడాయి. అయితే ఆ తర్వాత వరుసగా ఫ్లాఫులు పలకరించాయి. మహేష్ బాబుతో సినిమా చేసినా విజయం దరిచేరలేదు. చివరికి సీరియల్స్ చేసినా నిరాశే ఎదురైంది. దీంతో సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది మయూరి.
ఇదే క్రమంలో 2003లో ఎన్‌ఆర్‌ఐ ఆదిత్య థిల్లాన్‌ను మ్యారేజ్ చేసుకుంది మయూరి. ఆ తర్వాత న్యూయార్క్ వెళ్లి అక్కడే సెటిలైపోయింది. అక్కడి ప్రముఖ కాలేజ్ బరూచ్ కాలేజ్ జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత తన ప్రతిభతో ప్రముఖ గ్లోబల్ మీడియా ఏజెన్సీ పెర్ఫామిక్స్ అనే కంపెనీలో ఎండీ హోదాలో పనిచేసింది. ప్రస్తుతం మయూరి కాంగో గూగుల్ ఇండియాలో పనిచేస్తోంది. హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ రోల్‌లో కీలక బాధ్యతలు నిర్వర్విస్తోంది. గూగుల్ డిజిటల్ స్ట్రాటజీస్, ఇన్నోవేషన్స్ విభాగాన్ని పర్యవేక్షిస్తోన్న మయూరి కార్పొరేట్ రంగంలో తనదైన మార్క్ చూపిస్తోంది.
Mayoori Kango
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి