
డైరెక్టర్ శంకర్.. కొన్నేళ్ల క్రితం వరకు ఇండియాలోనే ఈయన ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకు నచ్చేలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీయడం ఈ డైరెక్టర్ స్టైల్. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, బాయ్స్, ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడు, రోబో, రోబో 2.0.. ఇలా ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించాడు శంకర్. ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపేవారు. కానీ అలాంటి ది గ్రేట్ డైరెక్టర్ సినిమాకే నో చెప్పారట టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. శంకరే స్వయంగా మహేష్ బాబును కలిసి మీకోసం ఒక కథను సిద్ధం చేశానని చెప్పినా మహేష్ బాబు రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు. మరి శంకర్ మూవీ ని వదులుకొని మహేష్ చేసిన ఆ సినిమా ఏది? ఆ మూవీ హిట్ అయ్యిందా? లేదా అన్నది తెలుసుకుందాం రండి.
బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన త్రీ ఇడియట్స్ సినిమాను శంకర్ నన్బన్ (తెలుగులో స్నేహితుడు) గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇందులో లీడ్ రోల్ పోషించాడు. అయితే ఈ సినిమాను తెలుగులో మహేష్ బాబుతో తెరకెక్కిద్దామనుకున్నారట శంకర్. సరిగ్గా అదే సమయంలో మహేష్ దూకుడు సినిమాకు కమిటై ఉన్నారట. అయితే ఈ సినిమా షూటింగ్ లో దూకుడు సినిమా డైరెక్టర్ శ్రీను వైట్ల మహేష్ కు కొన్ని డైలాగులు, సీన్ల గురించి వివరించారట. వీటికి ఫిదా అయిపోయిన మహేష్ వెంటనే నమ్రతకు ఫోన్ చేసి శంకర్ సినిమాను చేయడం లేదని చెప్పారట. ఈ విషయం గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ. ‘ ఆరోజు మహేష్ నమ్రత కు ఫోన్ చేసి ‘నేను ఆ సినిమా చేయడం లేదు. నాకు దూకుడు సినిమా చాలా ఇంపార్టెంట్. ఇదే చేస్తున్నాను” అని చెప్పారు. నేను వెంటనే ఆశ్చర్యపోయాను. బాబు శంకర్ గారి సినిమా.. నేను కూడా పెద్ద ఫ్యాన్ ని.. మీరు అలా ఎలా రిజెక్ట్ చేస్తారు అని అడగ్గానే.. లేదండీ , నేను ఈ సినిమానే చేస్తాను. ఈ సినిమా నా లైఫ్ లో చాలా ముఖ్యం. మీరు డీల్ చేసిన విధానం.. నాకు చాలా బాగానచ్చింది అని అన్నారు. ఆయన నమ్మకం అలా నిజమయింది. దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆయన కెరియర్లో మైల్ స్టోన్ గా నిలిచింది’ అని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.
దూకుడు రీ రిలీజ్ నేపథ్యంలో ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి