Tollywood: మత్తెక్కించే కళ్లతో మతిపోగొడుతోన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అందానికి ఆధార్ కార్డు గురూ!

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతీ విషయం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడూ అందుతోంది..

Tollywood: మత్తెక్కించే కళ్లతో మతిపోగొడుతోన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అందానికి ఆధార్ కార్డు గురూ!
Tollywood Heroine

Updated on: Feb 08, 2023 | 9:49 AM

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతీ విషయం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడూ అందుతోంది. వారి సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ నుంచి రేర్ ఫోటోస్ వరకు అన్నీ కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే హీరోహీరోయిన్లు కూడా ఇన్‌స్టా లైవ్‌ల ద్వారా ఫ్యాన్స్‌తో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. పైన పేర్కొన్న ఫోటోలోని ఓ స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీలోనూ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తొలి సినిమాతోనే అటు అందం.. ఇటు అభినయంతో ప్రేక్షకులను అలరించింది. తెలుగులోకి మహేష్ బాబు చిత్రంతో అరంగేట్రం చేసింది. ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.?

ఇంకా మీరు కనిపెట్టలేకపోతే.. మీకో క్లూ.. ఆ సినిమా ‘భరత్ అనే నేను’. హా.. ఎస్.. మీరనుకున్నది కరెక్టే.. ఆమె మరెవరో కాదు కియారా అద్వానీ. తాజాగా బాలీవుడ్ హీరో సిద్ధార్ద్ మల్హోత్రాను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. హిందీలో ‘ఫుగ్లీ’ సినిమాతో అరంగేట్రం చేసిన కియారా అద్వానీ.. ఆ తర్వాత ‘ఎం.ఎస్.ధోని’, ‘భరత్ అనే నేను’, ‘కబీర్ సింగ్’, ‘షేర్‌షా’, ‘భూల్ భులయ్యా 2’ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించింది. కాగా, కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో, హిందీలో ‘సత్యప్రేమ్ కి కథ’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.