Waltair Veerayya: ఓటీటీలోకి మెగాస్టార్‌ వాల్తేరు వీరయ్య.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌..

Waltair Veerayya: ఓటీటీలోకి మెగాస్టార్‌ వాల్తేరు వీరయ్య.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌..

Phani CH

|

Updated on: Feb 08, 2023 | 9:51 AM

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మెగా మల్టీస్టారర్‌ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది.

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మెగా మల్టీస్టారర్‌ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సుమారు 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంక్రాంతి విజేతగా నిలిచింది. కాగా థియేటర్లో బ్లాక్‌ బస్టర్‌ బొమ్మగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షిణకు తెరపడింది. మెగాస్టార్‌- మాస్‌ మహరాజాల మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. వాల్తేరు వీరయ్య డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మెగా బ్లాక్‌ బస్టర్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుర్ఖా వేసుకుని బ్యాంక్ కు వెళ్ళాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే ??

అవి ఇవి ఎందుకని ఏకంగా రైలు పట్టాలనే కొట్టేసిన దొంగలు..

ప్రేమే లేదని.. ఎన్ని కథల్ చెప్పారమ్మా.. చివరికి ఎన్ని హృదయాలు పగిలాయో

Allu Arjun: ఫ్యాన్స్‌ దెబ్బకి.. బన్నీ జంప్‌.. ఫోటో షూట్‌ కూడా రద్దు

Rishab Shetty: మరో కాంతార2 వచ్చేస్తోంది !! అనౌన్స్ చేసిన రిషబ్‌

 

Published on: Feb 08, 2023 09:51 AM