Soggade Chinni Nayana: సోగ్గాడే చిన్నినాయన సినిమాలో రమ్యకృష్ణ పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్.. ఎవరో తెలుసా?

అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో సోగ్గాడే చిన్న నాయన ఒకటి. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నాగార్జున భార్యగా నటించింది. సినిమాలో నాగ్ తర్వాత రమ్యకృష్ణ పాత్రే బాగా హైలెట్ అయ్యింది. అయితే ఈ రోల్ ను ఒక ఫేమస్ హీరోయిన్ రిజెక్ట్ చేసింది.

Soggade Chinni Nayana: సోగ్గాడే చిన్నినాయన సినిమాలో రమ్యకృష్ణ పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్.. ఎవరో తెలుసా?
Soggade Chinni Nayana Movie

Updated on: Nov 05, 2025 | 9:24 PM

అక్కినేని ద్విపాత్రాభినయం చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ అయ్యాయి. అందులో సోగ్గాడే చిన్ని నాయన ఒకటి. 2016 సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జునే స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్ , శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా వంటి భారీ సినిమాల పోటీని తట్టుకుని మరీ భారీ కలెక్షన్లు సాధించిందీ సినిమా. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున తో పాటు రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్, సంపత్ రాజ్, బ్రహ్మానందం, నాగేంద్రబాబు,పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే అనుష్కా శెట్టి, అనసూయ, హంసానందినీ స్పెషల్ రోల్స్ లో సందడి చేశారు. ఇక ఈ సినిమాలో నాగార్జున నటన హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నాగార్జున భార్య సత్య పాత్రలో రమ్యకృష్ణ యాక్టింగ్ కూడా అద్దిరిపోయింది. సినిమాలో నాగ్-రమ్యకృష్ణ కెమిస్ట్రీనే హైలెట్ అని చెప్పుకోవచ్చు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

అయితే సోగ్గాడి చిన్ని నాయన సినిమాలో నాగార్జున భార్యగా మొదట రమ్యకృష్ణను అనుకోలేదట. అత్తారింటికి దారేది ఫేమ్ నదియాను అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె పలు సినిమాలతో బిజీగా ఉందట. దీంతో నాగార్జున సినిమాను వదులుకోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదట. దీని తర్వాత మేకర్స్ రమ్యకృష్ణను కలిశారట. కథ విన్న వెంటనే ఆమె వెంటనే ఓకే చెప్పిందట. అలా సోగ్గాడే చిన్ని నాయన సినిమా పట్టాలెక్కిందట. ఒకవేళ రమ్యకృష్ణ పాత్రలో నదియా నటించి ఉంటే సినిమా రిజల్ట్ ఎలా ఉండేదో? ఫలితం ఎలా ఉన్నా నదియా మాత్రం ఒక మంచి సినిమాను మిస్ అయ్యిందని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జిమ్ లో  వర్కౌట్స్ చేస్తోన్న నటి నదియా..

సౌతిండియన్ స్టార్స్ రీ యూనియన్ పార్టీలో నదియా..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.