
గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ చాలా ఏళ్ల క్రితమే ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. అయినా ప్రతి పాఠశాలలో ఆయన చిత్ర పటం కనిపిస్తుంది. గణిత శాస్త్రానికి సంబంధించి ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలే నేటికి ప్రామాణికంగా ఉండడం విశేషం. 1887 డిసెంబర్ 22న ఈరోడ్, మద్రాసు ప్రెసెడెన్సీ,(ప్రస్తుతం తమిళనాడు)లో జన్మించిన రామానుజన్ చాలా చిన్న వయసులోనే చనిపోయారు. మశూచి వ్యాధి కారణంగా 1920 ఏప్రిల్ 26 న ఆయన కన్ను మూశారు. అప్పటికి రామానుజన్ వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈ గణిత మేధావి ఫ్యామిలీకి చెందిన ఒకామె ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేసులో జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది. అన్నట్లు ఈ తమిళ బ్యూటీ కోలీవుడ్ లో కంటే తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసింది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించిన ఈ బ్యూటీ రీసెంట్ గా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీలో యాక్ట్ చేసింది. హీరోల కంటే మేమేం తక్కువ కాదంటూ కరాటే, ఫైట్స్ కూడా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోన్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్.
ఓం భీమ్ బుష్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన ప్రీతి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కన్నప్ప సినిమాలో గ్లామరస్ రోల్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రీసెంట్ గా ప్రీతి నటించిన బ్లాస్ట్ సినిమా ఏ రేంజ్ లో పేలిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న రామానుజన్ రోడ్ లో జన్మించిన ప్రీతి ముకుందన్, శ్రీనివాస రామానుజన్ కి మునిమనవరాలు అవతుందట. ప్రీతి ముకుందన్ అమ్మ తరపు నుంచి ఈ సంబంధం కలుస్తుందట. అంటే ప్రీతి ముకుందన్ కి శ్రీనివాస రామానుజన్ ముత్తాత అవుతారన్నమాట. రామనుజనే కాదు…’గిటార్’లో ప్రావీణ్యం సంపాదించి మంచి పేరు తెచ్చుకున్నప్రఖ్యాత మ్యూజిషియన్ ‘గిటార్ ప్రసన్న’ కూడా ప్రీతి ముకుందన్ కు మేనమామ అవుతారట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి