
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు విచిత్రమైన కాంబినేషన్లు సెట్ అవుతుంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల జోడీ విషయంలో తరచుగా ఇలా జరుగుతుంటుంది. ఒక సినిమాలో హీరోతో కలిసి ఆడిపాడిన హీరోయిన్ మరో సినిమాలో అదే హీరోకు చెల్లెలిగా, అక్కగా లేదా మరో పాత్రలో కనిపించవచ్చు. అలాగే ఒక హీరోకు లవర్‌గా, భార్యగా నటించిన హీరోయిన్.. మరో సినిమాలో మరో హీరోకు అక్కగానో, అమ్మగానో నటిస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదు కానీ సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని కాంబినేషన్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి ఉదాహరణకు ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హీరోయిన్ ఒక సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేసింది. కానీ మరో సినిమాలో ప్రభాస్ కంటే వయసులో పెద్ద వాడైన హీరోకు తల్లిగా నటించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.
ప్రభాస్‌తో కలిసి యోగి సినిమాలో నటించింది నయనతార. వినాయక్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ ప్రభాస్- నయన తార జోడీకి మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలయ్యతో కలిసి సింహా సినిమాలో నటించింది నయనతార. ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్‌లో నటించాడు. ఇందులో ప్లాష్ బ్యాక్ లో వచ్చే బాలకృష్ణకు భార్యగా నటించింది. అలాగే కొడుకు బాలకృష్ణకు తల్లిగా నటించింది. అలా ఈ లేడీ సూపర్ స్టర్ బాలయ్యకు తల్లిగా, ప్రభాస్‌కు జోడీగా నటించింది.
కాగా సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో నయన తార ఒకరు. 40 ప్లస్ లోనూ అదే అందం, అదే క్రేజ్ తో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతోందీ అందాల తార. ప్రస్తుతం చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో నటిస్తోంది నయన తార. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యింద. మీసాల పిల్ల సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మెగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.