Tollywood: ఆర్టీసీ డ్రైవర్ కొడుకు.. ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్.. ఒక్క ఫ్లాప్ కూడా లేదు.. ఎవరో తెలుసా?

చాలామంది లాగే ఇతను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రైటర్ గానూ సత్తా చాటాడు. ఆ తర్వాత మెగా ఫొన్ పట్టుకున్నాడు. అంతే.. స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడీ డైరెక్టర్ పేరు టాలీవుడ్ లో తెగ వినిపిస్తోంది.

Tollywood: ఆర్టీసీ డ్రైవర్ కొడుకు.. ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్.. ఒక్క ఫ్లాప్ కూడా లేదు.. ఎవరో తెలుసా?
Tollywood Director

Updated on: Jun 07, 2025 | 7:58 AM

సినిమాలన్నాక సక్సెస్ లు, ఫ్లాపులు ఉంటాయి. హీరోకైనా, డైరెక్టర్ కైనా ఇవి కామనే. అయితే టాలీవుడ్ లో ది గ్రేట్ రాజమౌళికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అదేంటంటే.. ది మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. అంటే.. జక్కన్న ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల్లో ఏ ఒక్కటి ఫ్లాప్ కాలేదు. అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ అయితే మరికొన్ని ఇండస్ట్రీ హిట్ ఉన్నాయి. అయితే ది గ్రేట్ రాజమౌళి లాగే టాలీవుడ్ లో అపజయమెరుగని డైరెక్టర్ మరొకరు ఉన్నాడు. అతను ఇప్పటివరకు 9 సినిమాలు తీశాడు. మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కల్యాణ్ రామ్.. వంటి స్టార్స్, యంగ్ హీరోలతో సినిమాలు తీశాడు. ఈ సినిమాలన్నీ తెలుగు ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. అంటే 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నమాట. ఈ కారణంగానే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. అతను మరెవరో కాదు అనిల్ రావి పూడి.

గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన అనిల్ రావి పూడి తన తండ్రి పడిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘ మా నాన్న ఒక ఆర్టీసీ డ్రైవర్. నెలకు నాలుగు వేల రూపాయల జీతం.మాది ప్రకాశం జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. ఎంసెట్ లో నాకు 8000 ర్యాంక్ వచ్చింది. ఒక మంచి కాలేజీలో పేమెంట్ సీట్ తీసుకుని నన్ను మంచిగా చదివించాడు. ఇందుకోసం సంవత్సరానికి 45 వేలకు పైగా ఖర్చు పెట్టేవాడు. నెలకు 4 వేల రూపాలయ శాలరీ తీసుకునేవాడికి ఇది చాలా ఎక్కువ. నెలవారీ ఖర్చులు, ఇతర అవసరాలకు ఇది ఏ మాత్రం సరిపోదు. అందుకే లోన్లు తీసుకుని, వాటిని తీర్చడానికి చాలా కష్టపడాడు. ఆయన ఉదయం 4 గంటలకు ఇంటి నుంచి పోతే రాత్రి ఎప్పుడో 12 తర్వాత ఇంటికి వచ్చేవాడు. చాలా టఫ్ జాబ్. పల్లెటూర్లలో ఇరుకైన రోడ్లలో బస్సు నడపాలంటే చాలా కష్టం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మనల్ని చదివించడానికో, మనల్ని పైకి తీసుకురావడానికో మన వెనక ఫోర్స్ ఉంటుంది. వారే మన పేరెంట్స్. వారి కష్టం గురించి తెలుసుకుంటే మనం జీవితంలో తప్పు చేయం’ అని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.

మెగా 157 లో బిజి బిజీగా  అనిల్ రావి పూడి..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..