
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొన్ని రోజుల క్రితం ఓజీ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. సుజిత్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ అభిమానులకు ఫుల్ కిక్ ఇవ్వడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. థియేటర్లలో రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఓజీ సినిమా ఆపై ఓటీటీలోనూ రికార్డులు బద్దలు కొట్టింది. నెట్ ఫ్లిక్స్ లో చాలా రోజుల పాటు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించిన ఓజీ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ స్టైలిష్ విలన్ ఓమీగా అదరగొట్టాడు. అలాగే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుహాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు ఇలా ఎందరో స్టార్స్ ఓజీలో మెరిశారు.
ఓజీ సినిమాలో పవన్ రోల్ తో పాటు అభిమానులకు బాగా నచ్చిన మరో రోల్ శ్రియా రెడ్డిది. ప్రకాశ్ రాజ్ కూతురు గీత పాత్రలో అదరగొట్టిందీ సీనియర్ నటి. ఓజీ సినిమాలో శ్రియా రెడ్డి సీన్లు చాలానే ఉన్నాయి. అయితే విలన్ ఇమ్రాన్ హష్మీకి వార్నింగ్ ఇచ్చే సీన్స్ లో శ్రియ నటన హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఓజీ సినిమాతో చాలా రోజుల తర్వాత ఆమెకు మంచి రోల్ దొరికిందని చెప్పవచ్చు. అయితే ఓజీ సినిమాలో గీత పాత్రకు శ్రియా రెడ్డి ఫస్ట్ ఛాయిస్ కాదట. మొదట ఆ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ టబును సంప్రదించారట మేకర్స్. అయితే అప్పటికే ఆమె చేతిలో చాలా సినిమాలు ఉండడంతో ఓజీ సినిమాకు నో చెప్పిందట. దీంతో ఆమె స్థానంలో శ్రియా రెడ్డిని తీసుకున్నారట మేకర్స్. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ శ్రియా రెడ్డి రోల్ ను టబు చేసి ఉంటే ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేదని మెజారిటీ ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.