
టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల కుమారులు స్టార్ హీరోలు అవుతారనే గ్యారెంటీ ఉండదు. సినిమా పరిశ్రమలో ప్రతిభ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. టాలెంట్ లేకపోతే ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితం కొన్నిసార్లు దక్కకపోవచ్చు. అయితే, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా ఎదిగారు. ఆయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకుని తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ క్లాస్‌మేట్ అయిన ఒక హీరోయిన్ ఆయనకు ఒక సినిమాలో తల్లిగా నటించిందట. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం కావడం గమనార్హం.
ఆ హీరోయిన్ మరెవరో కాదు, ప్రముఖ నటి శ్రియా శరణ్. స్టార్ హీరో రామ్ చరణ్, హీరోయిన్ శ్రియ శరణ్‌లు నటనకు సంబంధించి ఒకేచోట శిక్షణ తీసుకున్నారు. ఈ విధంగా వీళ్లిద్దరూ క్లాస్‌మేట్స్ అయ్యారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పటి పాత్రకు శ్రియ తల్లిగా నటించారు. ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ తల్లిగా నటించింది శ్రియ.
చరణ్, శ్రియల వయసు దాదాపు సమానం కాగా, శ్రియ చరణ్ కంటే చాలా సంవత్సరాల ముందే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరోవైపు, మెగా హీరోలతో శ్రియ నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి మనకు తెలిసిందే. శ్రియ సీనియర్ హీరోయిన్ అయినా యూత్‌లో ఆమెకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. శ్రియ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది ఈ సుందరి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.