Soundarya: సౌందర్య నటించిన ఆఖరి సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా? పాపం ఆ హీరో కూడా యాక్సిడెంట్లోనే చనిపోయారు

టాలీవుడ్ అందాల తార సౌందర్య ఈ లోకం నుంచి వెళ్లిపోయి ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. కానీ తన సినిమాల రూపంలో ఇప్పటికీ మన కళ్ల ముందు మెదులుతూ ఉంటుందీ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే సౌందర్య ఆఖరిగా నటించిన సూపర్ హిట్ సినిమాలోని హీరో కూడా ఒక యాక్సిడెంట్ లో చనిపోయారని మీకు తెలుసా?

Soundarya: సౌందర్య నటించిన ఆఖరి సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా? పాపం ఆ హీరో కూడా యాక్సిడెంట్లోనే చనిపోయారు
Soundarya

Updated on: Jun 15, 2026 | 9:37 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘మహానటి’ సావిత్రి తర్వాత అంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న నటి సౌందర్య. తన సహజ సిద్ధమైన నటనతో, పద్ధతైన పాత్రలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ అందాల తార. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించారామె. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, జగపతిబాబు, మోహన్ బాబు.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ పంచుకున్నారు సౌందర్య. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషల్లో సినిమాలు చేశారామె. ఓవరాల్ గా వందకు పైగా సినిమాల్లో నటించిన ఆమె చాలా ఏళ్ల పాటు సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే సౌందర్య ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. 2004లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య దుర్మరణం చెందారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే యావత్ భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యంత విషాదకర సంఘటనల్లో సౌందర్య మరణం ఒకటని చెప్పవచ్చు.

కాగా సౌందర్య నటించిన చివరి చిత్రం శివ శంకర్. ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటించారు. కానీ సౌందర్యకు ఆఖరి ఘనవిజయాన్ని అందించిన సినిమా మాత్రం సీతయ్య అని చెప్పుకోవచ్చు. వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ లో నందమూరి హరికృష్ణకు జోడీగా నటించారు సౌందర్య. ఈ మూవీలో సౌందర్యతో పాటు సిమ్రాన్ కూడా మరో హీరోయిన్ గా నటించింది. రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ 2003 లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలైన ఏడాదిలోపే సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. యాదృచ్చికమో, దురదృష్టమో తెలియదు కానీ హీరో హరికృష్ణ కూడా ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. 2018 డిసెంబర్ 07న నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో హరికృష్ణకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఇలా ఒకే సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు వేర్వేరు ప్రమాదాల్లో మరణించడం తెలుగు సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు సినిమాల్లో వీరు లేని లోటు పూడ్చలేరని చెప్పవచ్చు.

సీతయ్య సినిమాలో సౌందర్య, హరికృష్ణ..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us