
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’ ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. దీంతో మేకర్స్ ఇప్పటికే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’లో నటించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా 74 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్‌కు ఎంతో ఎనర్జిటిక్ గా షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. మొదట విలన్ పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించారు రజనీకాంత్. ఆ తర్వాతా తన కృషి, స్టైల్, యాక్టింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రజనీకి అభిమానులు ఉన్నారు. కాగా రజనీ కాంత్ తో పాటు అతని భార్య కూడా ఒక సినిమాలో నటించింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. రజనీకాంత్, లతల పరిచయం అనుకోకుండా జరిగింది.
చెన్నైలోని ఎథిరాజ్ కళాశాలలో చదువుతోన్న లత ఒక ఇంటర్వ్యూ కోసం రజనీకాంత్‌ను కలిసింది. అప్పుడే వారి ప్రేమకథకు పునాది పడింది. ఈ మీటింగ్ తర్వాత వారి మనసులు కలిశాయి. దీంతో 1981 లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.రజనీకాంత్, లత దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లత కొన్ని చిత్రాలలో నేపథ్య గాయనిగా పాడింది, కానీ ఆమె ప్రొఫెషనల్ నటి కాదు. అయితే ఆమె ఒక సినిమాలో నటించింది. 1982లో వచ్చిన ‘అగ్ని సాక్షి’ చిత్రంలో రజనీకాంత్ తో కలిసి అతిథి పాత్రలో నటించింది లత.. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివకుమార్, సరిత ప్రధాన పాత్రల్లో నటించారు. రజనీకాంత్, లత క్యామియో రోల్స్ పోషించారు. ఈ మూవీలో రజనీ భార్యగా లత ఒక సీన్ లో మాత్రమే గెస్ట్ రోల్ లో నటించారు. లతా రజనీకాంత్ నటించిన ఒకే ఒక్క సినిమా ఇదే. ఇందులో కమల్ హాసన్ కూడా గెస్ట్ రోల్ లో నటించారు.
రజనీకాంత్ అభిమానులకు ‘కూలీ’ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజవుతుందా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
IT’S A WRAP FOR #COOLIE 💥 💥
What an incredible experience it has been travelling with @rajinikanth sir, @iamnagarjuna sir, @nimmaupendra sir, #SathyaRaj sir, #SoubinShahir sir, @shrutihaasan and the entire team 🤗🤗❤️❤️
Will forever cherish this amazing experience 🤗🙏 pic.twitter.com/yBuJ3wdEc1
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 18, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .