Ashutosh Rana : ఏంటీ సుధా.. ఈ స్టైలిష్ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయినా..? అస్సలు ఊహించలేదుగా..

తెలుగు చిత్రపరిశ్రమలో అతడు పాపులర్ విలన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యాడు. ప్రతి సినిమాలోనూ అద్భుతమైన నటనతో తన పాత్రకు పోస్తారు. అతడే అశుతోష్ రాణా. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ భాషలోల అనేక చిత్రాల్లో నటించాడు.

Ashutosh Rana : ఏంటీ సుధా.. ఈ స్టైలిష్ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయినా..? అస్సలు ఊహించలేదుగా..
Ashutosh Rana, Renuka

Updated on: Apr 02, 2025 | 11:13 AM

అశుతోష్ రాణా.. తెలుగు సినీరంగంలో మోస్ట్ పాపులర్ విలన్. స్టార్ హీరోల చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ మహారాజా రవితేజ నటించిన వెంకీ చిత్రంలో డీజీపీ పాత్రలో టెర్రిఫిక్ నటనతో అదరగొట్టేశాడు. పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తూనే తన నటనతో కామెడీని సైతం పండించగల నటుడు అశుతోష్ రామా. తెలుగులో వెంకీ తర్వాత అదే స్థాయిలో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా బంగారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో భూమారెడ్డి పాత్రలో అదరగొట్టేశారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ ఈ చిత్రంలో అశుతోష్ రాణా యాక్టింగ్ మరో హైలెట్ అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే బిజీ నటుడిగా మారిపోయాడు.

తెలుగులో ఒక్కమగాడు, విక్టరీ, బలుపు, తడాఖా, పటాస్ ఇలా వరుస సినిమాలతో అలరించాడు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగుతోపాటు అటు హిందీలోనూ పలు సినిమాల్లో నటించాడు. అలాగే తమిళం, కన్నడ, మరాఠీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇటు నటుడిగా.. అటు ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. అశుతోష్ రాణా కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అశుతోష్ రాణా భార్య సైతం తెలుగులో తోపు హీరోయిన్. అవును.. ఇంతకీ ఎవరు ఆ బ్యూటీ అనుకుంటున్నారా.. ? ఆమె పేరు రేణుక శహానే.

1998లో హిందీలో వచ్చిన తమచా అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. డైరెక్టర్ రాప్ గోపల్ వర్మ తెరకెక్కించిన మనీ సినిమాలో కథానాయికగా నటించింది. ఇందులో జేడీ చక్రవర్తి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఇటు తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. కానీ చేసిన ఒక్క సినిమాతోనే టాప్ హీరోయిన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..