Tollywood: ‘తమ్ముడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్ మీకు గుర్తుందా.. ఇప్పుడు ఇలా అయిపోయిందేంటి?

|

Jan 30, 2023 | 1:23 PM

పవన్ కళ్యాణ్ నటించిన 'తమ్ముడు' సినిమాలోని ఈ పాట.. ఎంత ఫేమసో.. ఇందులో కనిపించిన హీరోయిన్ కూడా అప్పటిలో ఇంతే ఫేమస్.

Tollywood: తమ్ముడు సినిమాలో సెకండ్ హీరోయిన్ మీకు గుర్తుందా.. ఇప్పుడు ఇలా అయిపోయిందేంటి?
Tollywood
Follow us on

‘హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చేపల్లే తుళ్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి’.. ఈ సాంగ్ మీ అందరికీ గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాలోని ఈ పాట.. ఎంత ఫేమసో.. ఇందులో కనిపించిన హీరోయిన్ కూడా అప్పటిలో ఇంతే ఫేమస్. 1999లో ‘తమ్ముడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ అందాల భామ.. తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలే. అయితేనేం.. పవన్ కళ్యాణ్ సరసన మొదటి సినిమాలోనే జతకట్టి.. అప్పట్లో మాంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఆమెవరో కాదు అదితి గోవిత్రికర్.

2002లో ‘సోచ్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన అదితి.. ఆ తర్వాత ’16 డిసెంబర్’, ‘బాజ్’, ‘డే దనా దన్’, ‘భేజా ఫ్రై 2’, ‘స్మైల్ ప్లీజ్’, ‘కోయి జానే నా’ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే ఇవేమి కూడా ఆమెకు మంచి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. సిల్వర్ స్క్రీన్‌పై మాత్రమే కాదు.. బుల్లితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అదితి గోవిత్రికర్.. పలు హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

ఇక అదితి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 1998లోనే ఈమె దావూడి బొహ్ర అనే వ్యక్తిని పెళ్ళాడింది. వీరికి ఇద్దరు సంతానం. పలు వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి ప్రస్తుతం తన పిల్లలతో కలిసి ముంబైలోని సోదరి ఆర్జూ గోవిత్రికర్‌తో నివసిస్తోంది. అలాగే ఇటీవల సైకాలజీలో తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అదితి.. ప్రస్తుతం లండన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో రెండో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. కాగా, అదితి గోవిత్రికర్ అటు మోడలింగ్.. ఇటు డాక్టర్ డిగ్రీ.. రెండూ కూడా చక్కగా హ్యాండిల్ చేస్తూ ముందుకు సాగుతోంది.