
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2, బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న( నేడు) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సింది.. కానీ ఊహించని విధంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో అదరగొట్టారు. ముఖ్యంగా అఘోర పాత్రలో దుమ్మురేపారు బాలయ్య.
ఇక ఇప్పుడు అఖండ 2లోనూ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు బాలకృష్ణ. అఖండ వన్ కంటే అఖండ 2లో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తుంది. మరోసారి అఘోర లుక్ లో ఫైట్స్ ఇరగదీశారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి కూడా అఘోర పాత్రలో నటించిన విషయం మీకు తెలుసా.? అవును మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ కంటే ముందు అఘోర పాత్రలో నటించారు.
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.. అలాగే చిరంజీవి శివుడిగా నటించిన అద్భుతమైన సినిమా శ్రీ మంజునాథ. అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చిరంజీవి శివుడిగా నటించారు. అలాగే ఇదే సినిమాలో అఘోరాగా కనిపించారు చిరంజీవి. ఓ సన్నివేశంలో ఆయన అఘోర పాత్రలో నటించారు. ఇక బాలకృష్ణ అఖండ లో అఘోరాగా కనిపించగా.. ఇప్పుడు అఖండ 2లో అఘోరగా కనిపించనున్నారు. అఖండ 2 విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .