Tollywood: కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్ ఈ హీరోయిన్..

|

Apr 23, 2024 | 7:02 PM

కానీ ఇండస్ట్రీలోకి నటీమణులుగా అడుగుపెట్టకముందే కాలేజీలో రోజుల్లోనే బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నవారు ఉన్నారు. ఆ విమర్శలు తన మానసిక పరిస్థితిని దెబ్బతీశాయని.. క్రమంగా తనను తాను అసహ్యంచుకుందట ఆ హీరోయిన్. కానీ ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్.. ఆ ముద్దుగుమ్మకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?...

Tollywood: కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్ ఈ హీరోయిన్..
Actress 1
Follow us on

సాధారణంగా సినీ పరిశ్రమలో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ రూపం, శరీరాకృతి గురించి చాలా మంది అనేక రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఇండస్ట్రీలోకి నటీమణులుగా అడుగుపెట్టకముందే కాలేజీలో రోజుల్లోనే బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నవారు ఉన్నారు. ఆ విమర్శలు తన మానసిక పరిస్థితిని దెబ్బతీశాయని.. క్రమంగా తనను తాను అసహ్యంచుకుందట ఆ హీరోయిన్. కానీ ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్.. ఆ ముద్దుగుమ్మకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?… తనే హీరోయిన్ దివ్య భారతి.

హీరోయిన్ దివ్య భారతి కోయంబత్తూరులో జన్మించింది. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన దివ్య భారతికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. జివి ప్రకాష్‌ నటించిన పామిలర్‌ చిత్రంతో ఆమె సినీరంగప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే అడియన్స్ దృష్టిని ఆకర్షించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇక ఇప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ గా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోయిన్.. కాలేజీ రోజుల్లో తన బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

“కాలేజీలో నన్ను “ఫాండా బాటిల్ సిస్టమ్” “స్కెలిటన్” “పెద్ద బట్ గర్ల్” పేర్లతో పిలిచేవారు. ఆ మాటలు నాపై తీవ్ర ప్రభావం చూపాయి. మెల్లగా నా శరీరాన్ని నేను అసహ్యించుకునేలా చేశాయి. జనాల ముందు నడవడానికి కూడా భయపడ్డాను. ఆ తర్వాత 2015లో ఇన్‌స్టాగ్రామ్‌ లో నా ఫోటోస్ షేర్ చేశాను. నేను పోస్ట్ చేసిన ప్రతి ఫోటోకు మంచి కామెంట్స్ వచ్చాయి. బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చినప్పుడు.. మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి అనే విషయాన్ని చెప్పడానికి ఆ రోజుల్లో నా వెంట ఎవరైనా ఉండే బాగుండేది అనిపించింది” అంటూ చెప్పుకొచ్చింది దివ్య భారతి. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.