తెలుగమ్మాయి లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందం, అభియనంతో ఆమె తెలుగు జనాల మనసుల్లో ఎప్పుడో ప్లేస్ సంపాదించుకుంది. ‘భద్రం కొడుకో’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది లయ. ‘స్వయంవరం’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత లయకు అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా కుటుంబ చిత్రాల కథానాయకిగా పేరుతెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో పదేళ్లపాటు హీరోయిన్‌గా రాణించింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. లయ టాప్ క్లాస్ చెస్ ప్లేయర్. రెండో తరగతిలో వున్నప్పుడే చదరంగంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. రాష్ట్రస్థాయిలో ఏడుసార్లు, జాతీయస్థాయిలో ఒకసారి పతకాలు కూడా గెలుచుకుంది. టెన్త్ క్లాస్ వరకు చెస్ పోటీలలో పాల్గొంది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది లయ. భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. తన భర్త పేరు గణేష్ గోగుర్తి అమెరికాలో ఫేమస్ డాక్టర్. ఇక లయ కూడా అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ జాబ్ చేసింది. ఇక తన భర్త సినిమాలు మానేయాలని చెప్పలేదని.. కానీ బిజీ లైఫ్, పిల్లలు కారణంగా అక్కడే ఉండిపోయినట్లు వెల్లడించింది. లయ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె ప్రజంట్ నైన్త్ క్లాస్ కాగా.. కుమారుడికి 12 ఏళ్లు ఉంటాయి.
ఇక లయ తనయ శ్లోకా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. శ్లోక కూడా లయ లాగా ఎంతో అందంగా ఉంటుంది. అచ్చం అమ్మ అందమే కుమార్తెకు వచ్చింది. వారిద్దర్నీ చూస్తే తల్లీకూతుళ్లు అనుకోరు. అక్కాచెల్లెళ్లు అనుకుంటారు. తన కుమార్తె హీరోయిన్‌గా ఓ సినిమాలోనైనా నటిస్తే చూడాలని ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు లయ. దీంతో శ్లోక కూడా ఇండస్ట్రీకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.