Sushmita Sen: మాజీ విశ్వసుందరికి మరోసారి బ్రేకప్ అయ్యిందా.. కారణం అతడేనా.?

|

Sep 06, 2022 | 7:35 AM

IPL ఫౌండర్ లలిత్ మోడీతో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ బ్రేకప్ నిజమేనా..మోడీ ఇన్‌స్టా‌లో వచ్చిన మార్పులు చూసి..వీరిద్దరు విడిపోయారంటూ వస్తున్న వార్తలకు కారణం అతడేనా అసలు విషయం ఏంటంటే..

Sushmita Sen: మాజీ విశ్వసుందరికి మరోసారి బ్రేకప్ అయ్యిందా.. కారణం అతడేనా.?
Sushmita Sen
Follow us on

IPL ఫౌండర్ లలిత్ మోడీతో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్(Sushmita Sen)బ్రేకప్ నిజమేనా..?మోడీ ఇన్‌స్టా‌లో వచ్చిన మార్పులు చూసి..వీరిద్దరు విడిపోయారంటూ వస్తున్న వార్తలకు కారణం అతడేనా.? అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ, సుస్మితా సేన్ విడిపోయారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నెల రోజుల క్రితం లలిత్‌, సుస్మిత డేటింగ్ వార్తలు హల్ చల్ చేశాయి, అయితే తాజాగా వీరిద్దరు బ్రేకప్ చేసుకున్నట్లు సమాచారం. లలిత్ మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన మార్పులు చూసి నెటిజన్లు వీరిద్దరు విడిపోయారని అంటున్నారు.ఇటీవలే ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌తో కలిసి సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నారు. నా బెటర్ హాఫ్ తో కొత్త జీవితం ప్రారంభమవుతుందని ట్వీట్‌లో తెలిపారు.

అయితే లేటెస్ట్‌గా వీరిద్దరు బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి సుస్మితా సేన్ కానీ.. లలిత్ మోడీ కానీ ఇంకా మాట్లాడలేదు.అయితే సోషల్ మీడియా యూజర్లు, లలిత్ మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని మార్పుల్ని గుర్తించారు.లలిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి సుస్మిత పేరును తొలగించారు. అంతేకాదు ఆమెతో కలిసి ఉన్న ఫోటోకు సంబంధించిన డీపీ కూడా మార్చేశారు.గతంలో సుస్మితతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన లలిత్ మోడీ.. ఇలా సడన్‌గా డీపీ మార్చేయడంతో.. ఆమెతో బ్రేకప్ అయ్యిందంటున్నారు నెటిజన్లు. అదే సమయంలో సుస్మిత సేన్ ఈ మధ్య తన మాజీ ప్రియుడు రోహ్మాన్‌తో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని క్లారిటీ వచ్చేసిందంటున్నారు నెటిజన్లు. ఐతే లలిత్ మోడీతో సుస్మిత బ్రేకప్‌కు మాజీ ప్రియుడు రోహ్మాన్ కారణమని ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

Sushmita Sen, Lalit Modi

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి