
ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్న సూపర్ స్టార్ ఎవరంటే టక్కున చెప్పే పేరు రజినికాంత్. ఎంతమంది కొత్త హీరోలు వచ్చిన ఆయన క్రేజ్ ను బీట్ చేయడం ఎవ్వరి వల్లా కాదు. ఇప్పటికి కూడా చాలా రికార్డ్స్ అయన పేరుమీదే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న మొదక్టి సౌత్ హీరోగా సూపర్ పేరిట రికార్డ్ ఉంది. ఆయన సినిమాలు విదేశాల్లోనూ విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా జపాన్ లో సూపర్ స్టార్ సినిమాలు బాగా ఆడతాయి. ఈ మధ్య కాలంలో రజినీకాంత్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆయన నటించిన లాస్ట్ మూవీ అన్నత్తే అభిమానులను నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఆయన నెక్స్ట్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న నయా మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కంటే ముందు దిలీప్. దళపతి విజయ్ తో కలిసి బీస్ట్ అనే సినిమా చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో జైలర్ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.
ఇక జైలర్ సినిమా బడ్జెట్ గురించి ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది. జైలర్ సినిమాను 225 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారట. కాగా ఈ మూవీకోసం సూపర్ అందుకున్న రెమ్యునరేషన్ అక్షరాలా 110 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దళపతి విజయ్ ఉన్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ 100 కోట్ల రెమ్యునరేషన్ మార్క్ ను టచ్ చేశారు. ఆయన మార్కెట్ ను దృష్టిలో పట్టుకొనే నిర్మాతలు అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనకాడరు. రజినీకాంత్ సినిమా అంటే 500 కోట్ల వసూళ్లు అవలీలగా రాబడుతుంది. ఇక ఇప్పుడు జైలర్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా సక్సెస్ పై ధీమాగా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.