
నటసింహం నందమూరి హీరో బాలకృష్ణ గురించి, ఆయన క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. యంగ్ హీరోలతో పోటీ పడుతూ.. వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అను అందుకుంటున్నారు బాలయ్య. అఖండ సినిమాతో సంచలన విరాజయం అందుకున్న బాలకృష్ణ.. రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మరో సూపర్ హిట్ ను అందుకున్నారు బాలయ్య. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో బాలయ్య ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2002 లో విడుదలైన ఈ సినిమా మంచి విహాయన్ని అందుకుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు. శ్రియ, టబు హీరోయిన్స్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా టబు ప్లేస్ లో మరో హీరోయిన్ ను అనుకున్నారట దర్శకుడు వి.వి వినాయక్.
జయప్రకాశ్ రెడ్డి, దేవయాని , చలపతి రావు, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు.
బాలయ్య తో సినిమా చేయడానికి హీరోయిన్స్ చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. కానీ రమ్యకృష్ణ మాత్రం బాలయ్యతో నటించే అవకాశం వస్తే వద్దనుకున్నారట. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్న సమయంలో హీరోకి తల్లి పాత్రలో నటిస్తే అవకాశాలు తగ్గుతాయని భావించిన రమ్యకృష్ణ చెన్నకేశవ రెడ్డి సినిమాను మిస్ చేసుకున్నారట.