Maharshi: మహేశ్‌ ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్‌ పాత్రను రిజెక్ట్‌ చేసిన మెగా హీరో.. ఎవరో తెలుసా?

|

May 09, 2023 | 6:10 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ లో 'మహర్షి' ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇదే మూవీలో మహేశ్‌ స్నేహితుడు రవిగా ఓ కీలకమైన పాత్రలో నటించాడు అల్లరి నరేష్‌. అప్పటివరకు కామెడీ సినిమాలకే పరిమితమైన అల్లరి నరేష్‌ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించాడు.

Maharshi: మహేశ్‌ మహర్షి సినిమాలో అల్లరి నరేష్‌ పాత్రను రిజెక్ట్‌ చేసిన మెగా హీరో.. ఎవరో తెలుసా?
Maharshi Movie
Follow us on

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ లో ‘మహర్షి’ ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇదే మూవీలో మహేశ్‌ స్నేహితుడు రవిగా ఓ కీలకమైన పాత్రలో నటించాడు అల్లరి నరేష్‌. అప్పటివరకు కామెడీ సినిమాలకే పరిమితమైన అల్లరి నరేష్‌ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించాడు. స్నేహం అలాగే తనను నమ్ముకున్న వాళ్ల కోసం తన కెరీర్‌ని కూడా త్యాగం చేసే పాత్రలో అద్భుతంగా నటించాడు నరేష్‌. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌ లో కంటతడి పెట్టించాడు. అలా మహర్షి విజయంలో అల్లరోడి పాత్ర కూడా హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కామెడీ రోల్స్‌కు కామా పెట్టేశాడు నరేశ్‌. నాంది, మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి సీరియస్ రోల్స్‌తో ముందుకు సాగుతున్నాడు. అలా అల్లరోడి కెరీర్‌ని మహర్షి సినిమా మలుపు తిప్పిందని భావించవచ్చు. అయితే నిజానికి మహర్షి సినిమాలో అల్లరోడు పోషించిన పాత్ర ముందుగా ఓ మెగా హీరో వద్దకు వెళ్లిందట. అయితే అతను రిజెక్ట్‌ చేయడంతో అల్లరి నరేశ్ దగ్గరకు వచ్చిందట. ఇంతకీ రవి పాత్రను రిజెక్ట్‌ చేసిన ఆ మెగా హీరో మరెవరో కాదు సాయి ధరమ్‌ తేజ్.

మహర్షి టైంలో సాయి ధరమ్ తేజ్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అలాంటి టైంలో మహర్షి లో రవి పాత్ర చేస్తే తేజ్‌కు మంచి బూస్టింగ్‌ వస్తుందని వంశీ పైడిపల్లి అనుకున్నాడట. అనుకున్నట్లు గానే సుప్రీం హీరోను సంప్రదించారట. అయితే కొన్ని కారణాల వల్ల సాయి ధరమ్‌ తేజ్‌ను ఈ పాత్రను వద్దనుకున్నారట. ఆ తర్వాత లైన్‌లోకి అల్లరి నరేశ్‌ వచ్చాడు. 2019లో విడుదలైన మహర్షి సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..