మరీ అంత తక్కువ..!! గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రష్మిక రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగు, హిందీ భాషలలో వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న ఈ అమ్మడు.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇటీవలే హారర్ థ్రిల్లర్ థామా సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ..

మరీ అంత తక్కువ..!! గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రష్మిక రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
Rashmika Mandanna

Updated on: Nov 10, 2025 | 8:50 AM

వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది అందాల భామ రష్మిక మందన్న.. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది.ఇటీవలే థామా అనే సినిమా చేసింది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అలాగే రీసెంట్‌గా తెలుగులో గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాకు మంచి టాక్ వస్తుంది. మెల్లమెల్లగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. . ఈ సినిమాలో రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డప్పటికీ ఈ సినిమా నెమ్మదిగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఇదిలా ఉంటే రష్మిక రెమ్యునరేషన్ గురించిన ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతున్నాయి.

చిరంజీవి రికార్డును రెండు రోజుల్లో బీట్ చేసిన చరణ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తండ్రి కొడుకులు

గర్ల్‌ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో రష్మిక పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది. ఆకట్టుకునే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక రష్మిక రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిన రష్మికా.. ప్రాజెక్ట్ కోసం రూ.5-6 కోట్ల వరకు అందుకుంటుంది. ఇక గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రష్మిక తక్కువ రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తుంది.

దొరికేసింది మావ..!! పెద్ది సాంగ్‌లో ఈ చిన్నదాన్ని గమనించారా..? ఆమె ఎవరంటే

‘గర్ల్‌ఫ్రెండ్’ కోసం మాత్రమే రూ.3 కోట్లు తీసుకుందని తెలుస్తుంది. కథ బాగా నచ్చడంతో పాటు సినిమాతో రష్మిక సంతృప్తిగా ఉందని అందుకే ఆమె తక్కువ రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తుంది. ఇక గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించాడు రాహుల్. ఈ సినిమాలో రష్మికతో పాటు.. అను ఇమ్మాన్యుయేల్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం థియేటర్స్ లో మంచి టాక్ తో దూసుకుపోతుంది గర్ల్ ఫ్రెండ్ మూవీ.

గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్.. కెరీర్ పీక్‌లో ఉండగానే క్యాన్సర్.. ఇప్పుడు ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.