తమిళ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటికే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ధనుష్ కు జోడిగా సాయిపల్లవి నటించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో టాక్ వినిపించింది. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ రానున్న ఈ చిత్రాన్ని ఎస్వీసీఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ నారంగ్, పీ. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా మరో గాసిప్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కంటే ముందే ధనుష్ తెలుగులో మరో సినిమా చేయబోతున్నాడట. అది కూడా ఓ కుర్ర దర్శకుడితో.. ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
అయితే ఆ దర్శకుడు ఎవరో కాదు ఇటీవల ,నితిన్ నటించిన రంగ్ దే సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి అంటున్నారు. ఇంతవరకూ వెంకీ ప్రేమకథలను మాత్రమే తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఆయనతో ధనుశ్ చేయనున్న సినిమా కూడా లవ్ స్టోరీనే అని అంటున్నారు. ఇటీవల యాక్షన్ .. ఎమోషన్ కథలు ఎక్కువగా చేస్తూ వచ్చిన ధనుశ్, ఈ సారి లవ్ స్టోరీనే ఎంచుకున్నాడని చెబుతున్నారు. మరో వైపు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కూడా లవ్ స్టోరీనే అని తెలుస్తుంది. కాగా.. ఇప్పటికే ధనుష్ కు తెలుగులో కూడా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ధనుష్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ సూపర్ హిట్ అందుకోవడంతో.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ధనుష్.
మరిన్ని ఇక్కడ చదవండి: