Thiruchitrambalam: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ సూపర్ హిట్ మూవీ తిరు.. ఎక్కడ చూడొచ్చంటే !

ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే కొన్ని సినిమాలు సడన్ గా ఎలాంటి చడీ చప్పుడు లేకుండా కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు మరో సినిమా కూడా సడన్ గా ఓటీటీలోకి వచ్చింది. ఆ సినిమానే తిరు. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 'తిరుచిత్రం బలం' అనే టైటిల్ తో తమిళ్ లో తెరకెక్కింది ఈ సినిమా.

Thiruchitrambalam: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ సూపర్ హిట్ మూవీ తిరు.. ఎక్కడ చూడొచ్చంటే !
Thiru Movie

Updated on: Oct 07, 2023 | 11:45 AM

ఇప్పటికే ఓటీటీలో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. వారం వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే కొన్ని సినిమాలు సడన్ గా ఎలాంటి చడీ చప్పుడు లేకుండా కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు మరో సినిమా కూడా సడన్ గా ఓటీటీలోకి వచ్చింది. ఆ సినిమానే తిరు. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ‘తిరుచిత్రం బలం’ అనే టైటిల్ తో తమిళ్ లో తెరకెక్కింది ఈ సినిమా. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం అందుకుంది. రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన నిత్యామీనన్ నటించింది. అలాగే భారతీ రాజా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. మిత్రన్ జవహర్ తిరు సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.

తిరు సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. నిన్నటి నుంచి (అక్టోబర్ 6 నుంచి) తిరు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి వ్యూస్ ను రాబడుతోంది తిరు సినిమా. తిరు సినిమా తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగు, తమిళ్ఎం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అలాగే ఆయన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ధనుష్.

ధనుష్ ట్విట్టర్ అకౌంట్స్ ..

ధనుష్ ట్విట్టర్ అకౌంట్స్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.