Dhanush: హిట్టు ఇచ్చిన టాలీవుడ్ డైరెక్టర్‏కు మళ్లీ ఛాన్స్.. ధనుష్ నెక్ట్స్ మూవీ అతడితోనే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ హీరో నటించిన చిత్రాలన్ని తెలుగులోనూ రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుభేర చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున సైతం ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Dhanush: హిట్టు ఇచ్చిన టాలీవుడ్ డైరెక్టర్‏కు మళ్లీ ఛాన్స్.. ధనుష్ నెక్ట్స్ మూవీ అతడితోనే..
Dhanush

Updated on: Jan 17, 2025 | 11:32 AM

గతేడాది తెలుగులో విడుదలైన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందులో లక్కీ భాస్కర్ ఒకటి. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతకు ముందు 2023లో వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్ సినిమా సైతం భారీ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వ్చచింది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ధనుష్ టీచర్ గా నటించడం గమనార్హం. ఈ చిత్రం తర్వాత నటుడు ధనుష్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 2024లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు బ్రింకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, అదితి బాలన్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమాకు అడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత తన 50వ సినిమా రాయన్ కు స్వీయ దర్శకత్వం వహించారు ధనుష్. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, సందీప్ కిసన్, కాళిదాస్ జయరామ్, దుషార విజయన్, ఎస్జే, సూర్య, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల పరంగానూ, ఆర్థికంగానూ అభిమానులను అలరించింది. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా.. దర్శకుడు నిలవుక్ ఎన్మెల్ ఎన్నడి గోపం అనే సినిమాలను చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తన 53వ చిత్రం ఇట్లీ కాడ్‌కి దర్శకత్వం వహించి, నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు నటుడు రాజ్‌కిరణ్, నిత్యా మీనన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఆ తర్వాత ధనుష్ మరోసారి వెంకీ అట్లూరితో జతకట్టబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌లో దుల్కర్‌ సల్మాన్‌ దర్శకత్వంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్‌ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..