టాలీవుడ్‌- కోలీవుడ్ మధ్య స్టార్ వార్..! ఇటు ఎన్టీఆర్ కుమారస్వామి.. అటు ధనుష్ తమిళ్ మురుగన్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. తొలి పోస్టర్‌తోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిత్రానికి పేరు ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ విడుదల చేసిన పోస్టర్, నిర్మాత నాగవంశీ, హీరో ఎన్టీఆర్ చేసిన సామాజిక మాధ్యమాల పోస్టులు తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి.

టాలీవుడ్‌- కోలీవుడ్ మధ్య స్టార్ వార్..! ఇటు ఎన్టీఆర్ కుమారస్వామి.. అటు ధనుష్ తమిళ్ మురుగన్
Ntr, Dhanush

Updated on: Jul 11, 2026 | 11:41 AM

టాలీవుడ్–కోలీవుడ్ మధ్య సోషల్ మీడియా వేదికగా స్టార్ వార్ మొదలైంది. ఒకే దేవుడు… ఒకే పురాణ నేపథ్యం…కానీ ఇద్దరు స్టార్ హీరోలు… ఇద్దరు స్టార్ దర్శకులు! ఏకకాలంలో పోటాపోటీగా సినిమాను అనౌన్స్ చేశారు. ఒకవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కుమారస్వామి స్టోరీ సెట్స్‌ మీదకు వెళ్తుండగా, మరోవైపు వెట్రిమారన్‌తో ధనుష్ ‘తమిళ్ మురుగన్’ను రంగంలోకి దింపాడు. ఈ రెండు సినిమాలపై సినీ వర్గాల్లోనే కాదు… అభిమానుల్లోనూ భారీ అంచనాలను పెంచాయి మరి ఇది యాదృచ్ఛికమా.? లేక నిజంగానే పురాణ గాథలపై రెండు ఇండస్ట్రీల మధ్య కొత్త పోటీ మొదలైందా? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం..

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు

ఇవి కూడా చదవండి

మొన్న.. జూనియర్ ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కుమారస్వామి నేపథ్యంలో సినిమా వస్తోందని ప్రకటించడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అది చల్లారకముందే…ధనుష్–వెట్రిమారన్ కాంబినేషన్‌లో తమిళ్ మురుగన్‌ను రంగంలోకి దింపారు. దీంతో సోషల్ మీడియాలో “తెలుగు కుమారస్వామి” Vs “తమిళ్ మురుగన్” అంటూ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ల యుద్ధం పీక్స్‌కు చేరింది. “మురుగన్ తమిళుల ఆరాధ్య దైవం.. అసలైన కథ మాదే అంటూ తమిళ అభిమానులు పోస్టులు పెడుతుంటే…”త్రివిక్రమ్ పురాణ కథలను కొత్త కోణంలో చూపిస్తాడని, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు సాటి లేదని తెలుగు అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. ఒకే దేవుడి నేపథ్యంతో రెండు భారీ చిత్రాలు ప్రకటించబడటంతో ఇప్పుడు రెండు ఇండస్ట్రీల మధ్య ఆసక్తికరమైన సమరం మొదలైంది.

ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

“ది సన్ ఆఫ్ శివ… ది ప్రైడ్ ఆఫ్ పార్వతి… ది ఎటర్నల్ కమాండర్…” అంటూ తన సినిమాపై జూనియర్ చేసిన ట్వీటిది.. అలాగే ధనుష్‌ ట్వీట్ చేస్తూ..”ది ఎటర్నల్ ప్రొటెక్టర్… ది వారియర్… ది కింగ్ అండ్ లీడర్ ఆఫ్ ది తమిళ్ పీపుల్ అండ్ ల్యాండ్స్…” అంటూ ధనుష్ ట్వీట్ చేయడం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. ఇప్పుడీ రెండు ట్వీట్లపై రెండు ఇండస్ట్రీల్లో హాట్ హాట్‌ చర్చ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైనప్పుడు స్కందుడు, కుమారస్వామి, దేవసేనాధిపతి చుట్టూ తిరిగే కథగా చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే పూర్తి టైటిల్, ఫస్ట్ లుక్ ఇంకా బయటకు రాలేదు. ఇదే సమయంలో ఎలాంటి లీకులు లేకుండా వెట్రిమారన్ నేరుగా ‘తమిళ్ మురుగన్’ టైటిల్, ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ విడుదల చేయడంతో చర్చ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో “ముందుగా ప్రకటించింది ఎన్టీఆర్ టీమ్.. కానీ ముందుగా ఫస్ట్ లుక్ ఇచ్చింది ధనుష్ టీమ్” అన్న పోలికలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడందరి దృష్టి ఈ రెండు ప్రాజెక్టులపైనే ఉంది. ఫ్యాన్స్ వార్ పక్కనపెడితే తెలుగు కుమారస్వామి కథ..తమిళ మురుగన్ కథ ఎలా ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. మరి చూడాలి ఎవరి మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో..

ఇది కూడా చదవండి : Bigg Boss 10 : నన్ను బిగ్ బాస్‌కు పంపండి.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా..! బషీర్ మాస్టర్ వీడియో

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ ..

ధనుష్ ట్వీట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us