
మాస్ మహా రాజా రవితేజ ఇటీవల కాలంలో హిట్ కొట్టడం కోసం చాలా కాలం పట్టింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ఇటీవల ధమాకా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మాస్ రాజా. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు రవితేజ. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించింది. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం(డిసెంబర్ 23న) విడుదలైంది. రిలీజ్ అయినా అన్ని ఏరియాలనుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈసినిమా విడుదలైన ఎనిమిదిరోజుల్లోనే 69 కోట్లు వసూల్ చేసింది. 8 రోజుల్లో 69 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసి ధమాకా.
తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 8 రోజులు పూర్తయ్యేనాటికి 69 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ వీకెండ్ లో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. అలాగే సంక్రాంతి లోగా ఈ సినిమా వందకోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.