Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

|

Aug 28, 2022 | 7:59 PM

పుష్ప సినిమా పాన్ ఇండియన్ రేంజ్లో సూపర్ డూపర్ హిట్‌ అయింది. హిట్ అవ్వడమే కాదు.. బన్నీని ఇండియన్ బాక్సాఫీస్ కింగ్‌ను చేసింది. త్రూ అవుట్ వరల్డ్ పుష్ప సినిమా 2 ఎప్పుడాని ఎదురుచేసేలా చేసింది.

Pushpa 2 The Rule: పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Pushpa 2 shooting
Follow us on

పుష్ప(Pushpa )సినిమా పాన్ ఇండియన్ రేంజ్లో సూపర్ డూపర్ హిట్‌ అయింది. హిట్ అవ్వడమే కాదు.. బన్నీని ఇండియన్ బాక్సాఫీస్ కింగ్‌ను చేసింది. త్రూ అవుట్ వరల్డ్ పుష్ప సినిమా 2 ఎప్పుడాని ఎదురుచేసేలా చేసింది. ఇక అందరి వెయిటింగ్‌కు ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేలా చేసింది సుకుమార్ అండ్ టీం. తాజాగా పుష్ప2 మూవీ పూజా కార్యక్రమాలను నిర్వహించింది. ఇక షూటింగ్ షురూ అవ్వడమే ఆలస్యం… ఆగేది లే.. తగ్గేది లే అనే హింట్‌ను బన్నీ ఫ్యాన్స్ కు ఇచ్చేసింది. ఇక ఈ సినిమాకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమానుంచి అదిరిపోయే క్రేజీ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ. పుష్ప సినిమా లో పాటలు ఈ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచం మొత్తం దేవీ పాటలు మారుమ్రోగాయి. ఇప్పుడు పుష్ప 2 కోసం కూడా దేవీ అదిరిపోయే పాటలను సిద్ధం చేస్తున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమాకోసం మూడు పాటలను కంప్లీట్ చేశారట దేవీ. ఇదే విషయాన్నీ తెలిపారు దేవీ శ్రీ. ఇక కథ ఎలా ఉంటుందా అని ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నాం.. మీము డిఫరెంట్ గా చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు. దేవీ శ్రీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరాల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి