Devi Sri Prasad: రాక్ స్టార్ అదరగొట్టాడుగా.. పవన్ కల్యాణ్ సాంగ్‌కు దేవి శ్రీ సూపర్బ్ స్టెప్పులు.. వీడియో ఇదిగో

దేవి శ్రీ ప్రసాద్ అంటేనే ఎనర్జీ. అతని పాటల్లానే అతను కూడా ఎంతో ఎనర్జిటిక్ గా, హుషారుగా ఉంటాడు. తాజాగా డీఎస్పీ తను సొంతంగా కంపోజ్ చేసిన ఒక పాటకు స్టెప్పులేశారు. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని దేఖ్ లేంగే సాలాను రీక్రియేట్ చేశారు.

Devi Sri Prasad: రాక్ స్టార్ అదరగొట్టాడుగా.. పవన్ కల్యాణ్ సాంగ్‌కు దేవి శ్రీ సూపర్బ్ స్టెప్పులు.. వీడియో ఇదిగో
Devi Sri Prasad

Updated on: Jan 04, 2026 | 5:50 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్, హరీశ్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజైన డేఖ్‌లేంగే సాలా యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ గ్రేస్ ఫుల్ గా స్టెప్పులేయడంతో ఈ పాటకు మరింత ఊపునిచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ దేఖ్ లేంగే సాలా సాంగే వినిపిస్తోంది. ప్రస్తుతం అభిమానులను ఊపేస్తోన్న ఈ ట్రెండీ సాంగ్ కు దేవి శ్రీ ప్రసాద్ డ్యాన్స్ చేశాడు. హీరోలకు ఏ మాత్రం తక్కువ గాకుండా ఎంతో ఎనర్జిటిక్ గా స్టెప్పులేశాడు. తను కంపోజ్ చేసిన పాటకు తనే ఇలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేయడం అభిమానులకు చాలా నచ్చింది. అందుకే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీలీ, రాశీ ఖన్నా హీరోయిన్లు నటిస్తున్నారు. ఇద్దరూ పవన్ కళ్యాణ్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. కోలీవుడ్ సీనియర్ నటుడు పార్థీబన్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

ఉస్తాద్ భగత్ సింగ్ పాటకు దేవి శ్రీ ప్రసాద్ డ్యాన్స్.. వీడియో ఇదిగో..

విదేశాల్లోనూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .