
టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు సందీప్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు.. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో ఇదే సినిమాను రీమేక్ చేసి అక్కడ కూడా భారీ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి. ఇక యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించిన యానిమల్ సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా కోసం రెడీ అవుతున్నాడు సందీప్. ఇప్పటికే ఈ సినిమా పనులు కూడా మొదలు పెట్టేశాడు.
ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటిస్తున్నాడని టాక్. ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాశాడట సందీప్ రెడ్డి వంగ. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు ఈ సినిమా కోసం దీపికా ఏకంగా రూ. 20కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్ కూడా వినిపించింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి దీపికా తప్పుకుందని టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న దీపికా ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన దీపికా ప్రస్తుతం ఆ బిడ్డ లాలన చూసుకుంటుంది. త్వరలోనే ఈ చిన్నది తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో ఛాన్స్ దక్కిందట.. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి దీపికా తప్పుకుందని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడట సందీప్ రెడ్డి. గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు సందీప్ రెడ్డి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి